AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alla Nani : బంధుత్వాన్ని ఉపయోగించి బాబు వ్యాక్సిన్లు రప్పిస్తే మాకు సమ్మతమే : ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

AP Health Minister : టీడీపీ అధినేత చంద్రబాబు భారత్ బయోటెక్ ఎండీతో ఉన్న బంధుత్వాన్ని ఉపయోగించి కరోనా వ్యాక్సిన్లు తెప్పించినా తమకు అభ్యంతరం లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.

Alla Nani : బంధుత్వాన్ని ఉపయోగించి బాబు వ్యాక్సిన్లు రప్పిస్తే మాకు సమ్మతమే : ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని
Ap Minister Alla Nani
Venkata Narayana
| Edited By: Team Veegam|

Updated on: May 12, 2021 | 11:20 PM

Share

AP Health Minister : టీడీపీ అధినేత చంద్రబాబు భారత్ బయోటెక్ ఎండీతో ఉన్న బంధుత్వాన్ని ఉపయోగించి కరోనా వ్యాక్సిన్లు తెప్పించినా తమకు అభ్యంతరం లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సంక్షేమ పథకాల రూపంలో వేల కోట్ల రూపాయలను పేదలకు అందించిన సీఎం వైయస్‌ జగన్‌.. వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ. 1600 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ నీచ రాజకీయాలు చేస్తూ చంద్రబాబు వికృతానందం పొందుతున్నాడని మండిపడ్డారు. వ్యాక్సిన్ల అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని తెలియదా..? సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ గురించి తెలియదా..? అని చంద్రబాబును మంత్రి ఆళ్ల ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు జనాలను భయపెట్టేలా ఉన్నాయని విమర్శించారు. వ్యాక్సిన్ ప్రక్రియ మొత్తం ఉచితంగానే జరగాలనేది సీఎం జగన్ అభిమతమన్నారు. కేంద్రం ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చినా పంపిణీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకే రోజు 6 లక్షల డోసులు వేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదని ఆళ్ల చెప్పుకొచ్చారు. కోవిడ్‌ కట్టడి, ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మెడిసిన్, వ్యాక్సినేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇవాళ అమరావతిలో భేటీ అయింది.

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి సబ్‌ కమిటీ సభ్యులు, మంత్రులు మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ నియంత్రణ కార్యక్రమాల్లో ప్రధానమైన అంశాలైన ఆక్సిజన్, రెమిడెసివిర్‌ ఇంజక్షన్, బెడ్స్, డాక్టర్స్‌ రిక్రూట్‌మెంట్, టెస్టింగ్, హోంఐసోలేషన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు వంటి అంశాలపై గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ భేటీలో చర్చించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా, ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని మంత్రి వెల్లడించారు.

Read also : Etela Meets DS : భవిష్యత్‌ రాజకీయం వైపు వడివడిగా ఈటల అడుగులు.. టీఆర్‌ఎస్‌ ఎంపీ డీఎస్ తో రెండు గంటలపాటు భేటీ