Scholarship: తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం.. లాఫాయేట్ కాలేజీ రూ. 2 కోట్ల స్కాలర్‌షిప్
Scholarship: తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రానికి చెందిన విద్యార్థిని శ్వేతా రెడ్డి(17)కి అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ ఏకంగా 2 కోట్ల రూపాయల.
Scholarship: తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రానికి చెందిన విద్యార్థిని శ్వేతా రెడ్డి(17)కి అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ ఏకంగా 2 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ ఆఫర్ చేసింది. లాఫాయేట్ కాలేజీలో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్‌తో పాటు ఈ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ కళాశాలలో అడ్మిషన్ దక్కించుకోవడమే గొప్ప విషయం కాగా, అందులో శ్వేతారెడ్డి స్కాలర్ షిష్‌ను కూడా దక్కించుకుంది. కాగా, డైయర్ ఫెలోషిప్ పేరిట లాఫాయెట్ కాలేజీ ప్రతి ఏడాది ఆరుగురు విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంపికైన ఆరుగురిలో శ్వేతారెడ్డి
కాగా, ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఎంపికైన ఆరుగురిలో తెలుగు విద్యార్థి శ్వేతారెడ్డి కావడం విశేషం. శ్వేతారెడ్డి ప్రతిభ, నాయకత్వ లక్షణాలు చూసే ఈ స్కాలర్ షిప్‌కు ఎంపిక చేసినట్లు లాఫాయెట్ కాలేజీ వెల్లడించింది.
స్కాలర్‌షిప్ రావడం ఎంతో గర్వకారణంగా ఉంది: శ్వేతారెడ్డి
అయితే ఇలాంటి స్కార్‌షిప్‌కు ఎంపిక కావడం చాలా తక్కువ మంది విద్యార్థులు ఉంటారు. అయితే ఈ స్కాలర్‌షిప్ రావడంపై శ్వేతారెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. తనకు ఇలాంటి అద్భుత అవకాశం రావడం వెనక డెక్స్ టెరీటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం ఉందని, దాని వల్లే తాను ఈ స్కాలర్ షిప్ అందుకోగలిగానని పేర్కొంది. కాగా, శ్వేతారెడ్డి స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడం పట్ల ఎంపీ బండి సంజయ్ అభినందించారు. శ్వేతారెడ్డి తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, అందరికి ప్రేరణ అని అన్నారు.
A proud moment for Telangana. You are an inspiration to all, Swetha. Keep up the phenomenal work. Congratulations and wish you all the success as you embark on the new journey. https://t.co/jS3EG4a8xN
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 14, 2021