Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టింది. గతంలో భారీగా నమోదైన పాజిటివ్‌ కేసులు.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో..

Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 14, 2021 | 8:06 PM

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టింది. గతంలో భారీగా నమోదైన పాజిటివ్‌ కేసులు.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రస్తుతం పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా తాగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 749 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,33,895 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3,749 మంది కరోనా బారిన పడి మరణించారు.

ఇక తాజాగా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 605 ఉండగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 6,19,949 ఉంది. అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతం ఉండగా, అదే దేశంలో 1.3 శాతం ఉన్నట్లు ఆరోగ్యశాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. ఇక రాష్ట్రంలో కోలుకున్న వారి రేటు 97.79 ఉండగా, అదే దేశంలో 97.26 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య10,203 ఉన్నట్లు వెల్లడించింది. కాగా, నిన్నటి కంటే ఈ రోజు స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి.

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలు:

ఆదిలాబాద్‌లో 1, భద్రాది కొత్తగూడెం-36, జీహెచ్‌ఎంసీ-72, జగిత్ఆయల -18, జనగామ – 5, జయశంకర్‌ భూపాలపల్లి-15, జోగులాంబ గద్వాల – 4, కామారెడ్డి -2, కరీంనగర్‌ – 58, ఖమ్మం-96, కొమురంభీం ఆసిఫాబాద్‌ – 1, మహబూబ్‌నగర్‌ – 8, మహబూబాబాద్‌ -18, మంచిర్యాల – 43, మెదక్‌ – 4, మేడ్చల్‌ మల్కాజిగిరి – 28,ములుగు -11,నాగర్‌ కర్నూలు -5, నల్గొండ -54, నిర్మల్‌- 4, నిజామాబాద్‌ – 11, పెద్దపల్లి-41,రాజన్న సిరిసిల్ల- 21, రంగారెడ్డి-32, సంగారెడ్డి-12, సిద్ధిపేట -22, సూర్యాపేట -34, వికారాబాద్‌ -5, వనపర్తి -7, వరంగల్‌ రూరల్‌ – 9, వరంగల్‌ అర్బన్‌-55 యాదాద్రి భువనగిరి – 16 పాజిటివ్‌ కేసుల చొప్పున నమోదు అయ్యాయి.

ఇవీ కూడా చదవండి

AP Covid Cases: ఏపీలో తగ్గని కరోనా వైరస్ ప్రభావం.. మళ్లీ పెరిగిన కేసులు.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల వార్నింగ్..

Kappa Variant: కరోనా వైరస్ మరో వేరియంట్ కప్పా..రాజస్థాన్ లో తొలి కేసు నమోదు..కప్పా వేరియంట్ గురించి పూర్తి సమాచారం!