AP Covid Cases: ఏపీలో తగ్గని కరోనా వైరస్ ప్రభావం.. మళ్లీ పెరిగిన కేసులు.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల వార్నింగ్..

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. ఒక రోజు తగ్గినట్లే తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. మరుసటి రోజు మళ్లీ..

AP Covid Cases: ఏపీలో తగ్గని కరోనా వైరస్ ప్రభావం.. మళ్లీ పెరిగిన కేసులు.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల వార్నింగ్..
Corona Third Wave
Follow us

|

Updated on: Jul 14, 2021 | 5:38 PM

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. ఒక రోజు తగ్గినట్లే తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. మరుసటి రోజు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2,591 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,204 సాంపిల్స్‌ని పరీక్షించిన వైద్యులు.. 2,592 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 511 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 3,329 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఈ మహ్మమారి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కాగా, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,32,20,912 సాంపిల్స్ పరీక్షించారు. మొత్తం 19,29,579 మంది కోవిడ్ బారిన పడగా.. 18,90,565 మంది కోలుకుని క్షేమంగా ఉన్నారు. ఇక వైరల్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 13,057 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేట్ 2.8 శాతం ఉండగా, రికవరీ రేటు 98 శాతం ఉంది. అలాగే కోవిడ్ మరణాల శాతం 0.68 గా ఉంది.

తాజాగా నమోదైన కేసుల్లో జిల్లాల వారీ వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం – 69, చిత్తూరు – 349, తూర్పు గోదావరి – 511, గుంటూరు – 219, కడప – 217, కృష్ణా – 190, కర్నూలు – 29, నెల్లూరు – 162, ప్రకాశం – 251, శ్రీకాకుళం – 62, విశాఖపట్నం – 220, విజయనగరం – 46, పశ్చిమ గోదావరి – 266 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక మరణాల వివరాలు జిల్లాల వారీగా.. చిత్తూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలాఉంటే.. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పక జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లవద్దని సూచించారు. ఒకవేళ వెళ్లినా తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పటించాలని ఆంధ్రప్రదేశ్ కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Also read:

Samantha Akkineni: ఫ్రీ టైం ఎంజాయ్ చేస్తున్న అక్కినేని వారి కోడలు.. పెంపుడు కుక్క పిల్లతో కలిసి బెలూన్ ఆట..

నందిగ్రామ్ ఎన్నిక ఫలితాలపై ఈసీకి కలకత్తా హైకోర్టు నోటీసు.. మమత పిటిషన్ పై తీర్పు ఎలా వస్తుందో..?

parliament: రాజ్యసభలో సభా పక్షనేతగా పీయూష్ గోయెల్, లోక్ సభలో రాహుల్ గాంధీ ..?