parliament: రాజ్యసభలో సభా పక్షనేతగా పీయూష్ గోయెల్, లోక్ సభలో రాహుల్ గాంధీ ..?

పార్లమెంటులో రెండు కీలక పదవులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. రాజ్యసభలో సభా పక్ష నేతగా పీయూష్ గోయెల్, లోక్ సభలో రాహుల్ గాంధీ నియమితులు కావచ్చునని తెలుస్తోంది.

parliament: రాజ్యసభలో సభా పక్షనేతగా పీయూష్ గోయెల్, లోక్ సభలో రాహుల్ గాంధీ ..?
Rahul Gandhi
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 14, 2021 | 5:25 PM

పార్లమెంటులో రెండు కీలక పదవులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. రాజ్యసభలో సభా పక్ష నేతగా పీయూష్ గోయెల్, లోక్ సభలో రాహుల్ గాంధీ నియమితులు కావచ్చునని తెలుస్తోంది. లోక్ సభలో ప్రస్తుత కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్థానే రాహుల్ గాంధీని నియమించవచ్చునని అంటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కావలసి ఉన్నాయి. ఈ కారణంగా త్వరగా ఈ నియామకాలను చేపట్టాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో 48 గంటల్లో రాహుల్ నియామకంపై నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం.. అయితే ఆయన విముఖంగా ఉంటున్నారని అంటున్నా ఆయనే ఈ పదవికి తగినవారని సీనియర్ నేత ఒకరు తెలిపారు. రాజ్య సభలో ఇటీవలివరకు బీజేపీ పక్ష నేతగా ఉన్న తావర్ చంద్ గెహ్లాట్ ను కర్ణాటక గవర్నర్ గా నియమించడంతో సభలో ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో పలు కకీలక పదవులు నిర్వహించిన పీయూష్ గోయెల్ ను సభా పక్ష నేతగా నియమించాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలిసింది. గత రెండేళ్లుగా ఈయన సభలో తమ పార్టీ తరఫున విపక్షాలను దీటుగా ఎదుర్కొంటున్నారని పార్టీ భావిస్తోంది.

పైగా బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్ కి మధ్య వైషమ్యాలు ఉన్నప్పటికీ పీయూష్ గోయెల్ పార్లమెంటు లోపల, బయట కూడా ఈ పార్టీతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కేబినెట్ మంత్రి అయిన భూపేందర్ యాదవ్ పేరును కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇక లోక్ సభ విషయానికి వస్తే రాహుల్ గాంధీతో బాటు శశిథరూర్, మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు కూడా పరిశిలనలో ఉన్నాయట. రవనీత్ సింగ్ బిట్టూ కూడా రేసులో ఉన్నట్టు సమాచారం.

మరిన్ని ఇక్కడ చూడండి: George w bush: ఆఫ్ఘనిస్తాన్ లో దళాల ఉపసంహరణ పొరబాటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్

Priyamani: సన్నబడ్ద ప్రియామణి.. లేటెస్ట్ బ్యూటిఫుల్ పిక్స్..