George w bush: ఆఫ్ఘనిస్తాన్ లో దళాల ఉపసంహరణ పొరబాటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్
ఆఫ్ఘానిస్తాన్ నుంచి సైనిక దళాలను ఉపసంహరించడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ తప్పు పట్టారు. ఆఫ్ఘన్ లో ప్రజలను తాలిబన్లు ఊచకోత కోస్తున్నారని, అక్కడ మహిళలు, పిల్లలు చెప్పలేనంత హానిని ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.
ఆఫ్ఘానిస్తాన్ నుంచి సైనిక దళాలను ఉపసంహరించడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ తప్పు పట్టారు. ఆఫ్ఘన్ లో ప్రజలను తాలిబన్లు ఊచకోత కోస్తున్నారని, అక్కడ మహిళలు, పిల్లలు చెప్పలేనంత హానిని ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. సైనిక దళాల ఉపసంహరణ పొరబాటేనని ఆయన అంగీకరిస్తూ.. తాలిబన్లు అమాయక ప్రజలను దారుణంగా హతమారుస్తున్నారని..ఇది తన హృదయాన్ని కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్మనీ బ్రాడ్ కాస్టర్ డ్యూష్ వెల్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. ఈ పొరబాటు జరిగి ఉండాల్సింది కాదన్నారు. 2001 సెప్టెంబరు 11 న న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులు జరిగిన అనంతరం అమెరికా ఆఫ్ఘన్ దేశానికి తన సైనిక బలగాలను పంపింది. ఆఫ్ఘన్ సంక్షోభం విషయంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ కూడా తనలాగే బాధ పడుతున్నారని జార్జి డబ్ల్యు బుష్ తెలిపారు. 16 ఏళ్ళ అనంతరం ఈ ఏడాది అంతానికి ఆమె రాజకీయాలనుంచి వైదొలగుతున్నారని ఆయన చెప్పారు.
మార్కెల్ తన పదవికి ఎంతో హుందాతనాన్ని తెచ్చారని, ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అన్నారు. ఆఫ్గనిస్తాన్ లో గత మే మొదటివారం నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. సెప్టెంబరు 11 నాటికి ఇవి పూర్తిగా అక్కడి నుంచి నిష్క్రమించనున్నాయి. అక్కడి నుంచి అమెరికా ట్రూప్స్ ని ఉపసంహరిస్తామని అధ్యక్షుడు జోబైడెన్ గత ఏప్రిల్ నెలలో ప్రకటించారు. ఇలా ఉండగా తాజాగా ఆఫ్ఘన్ లో తాలిబన్ల అరాచకాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన ప్రకటించింది. వారి జోరును నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే అక్కడ వారి పోరు ముగిసేలా తాము చర్యలు తీసుకోవలసి ఉందని జోబైడెన్ అన్నారు. తగిన సమయం చూసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Audi E-Tron: గుడ్‌న్యూస్.. ఆడి నుంచి సరికొత్త విద్యుత్ కారు.. భారత్‌లో ఎప్పుడు విడుదలంటే..!