Bellamkonda Sreenivas : పెళ్లి చేసుకోబోతున్న మరో టాలీవుడ్ హీరో.. బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక చూశారా.. ?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో హీరో తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. తాజాగా తన కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరిగింది.

టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న శ్రీనివాస్ పెద్దల అంగీకారంతో తన ప్రేయసిని వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఆదివారం (మార్చి 8న) శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహ వేడుక నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‌నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుకలో టాలీవుడ్ సినీప్రముఖులు సందడి చేశారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, సాహు గారపాటి, శిరీష్, హర్షితా రెడ్డితోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది.
ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..
సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు కావ్య రెడ్డి అని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండే అమ్మాయి. ఆమె తాతయ్య జడ్జి అని.. తండ్రి లాయర్ అని సమాచారం. త్వరలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోనున్నారు. అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్.. పలు చిత్రాల్లో నటించారు.
ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..
#BellamkondaSrinivas engagement pic.twitter.com/CsQESdIcJn
— Banda Kalyan (@BandaKalyan) March 8, 2026
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..
