Viral News: పాపం కుర్రాడు.. ఏదో చేయబోయి అడ్డంగా బుక్ చేశాడు.. ట్రాఫిక్ పోలీసుల ఫన్నీ మీమ్.. చూస్తే నవ్వు ఆగదు..

Cyberabad Traffic Police: సోషల్ మీడియాలో గత కొన్నేళ్లుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త ట్రెండ్‌ని సెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాను..

Viral News: పాపం కుర్రాడు.. ఏదో చేయబోయి అడ్డంగా బుక్ చేశాడు.. ట్రాఫిక్ పోలీసుల ఫన్నీ మీమ్.. చూస్తే నవ్వు ఆగదు..
Cyberabad Traffic Police
Follow us

|

Updated on: Jul 14, 2021 | 5:14 PM

Cyberabad Traffic Police: సోషల్ మీడియాలో గత కొన్నేళ్లుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త ట్రెండ్‌ని సెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో వాడేస్తూ.. వాహనదారులను నవ్విస్తూనే చురకలంటిస్తున్నారు. ప్రొఫెషనల్ మీమర్స్ మాదిరిగా మీమ్స్ చేస్తూ.. ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పడుతున్నారు. ఈ ఫన్నీ మీమ్స్‌తో ఓ వైపు ట్రాఫింక్ ఉల్లంఘనులను భారీ జరిమానాలతో హడలెత్తిస్తూనే.. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాలంటే భయపడేలా వాహనదారులను కంట్రోల్ చేస్తున్నారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కెమెరాకు చిక్కడమే ఆలస్యం.. ఆ ఫోటోను ఓ రేంజ్‌లో వాడేసుకుంటున్నారు. తాజాగా అలాంటి మీమ్‌నే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ ఫన్నీ మీమ్ నెటిజన్లను ఎంతగానో అకట్టుకుంటోంది. అదే సమయంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తోంది.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు యువకులు కనీసం హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఇక స్కూటీ నడుపుతున్న యువకుడు ఒక్క చేత్తో డ్రైవ్ చేస్తూ.. మరో చేత్తో ఫోన్ మాట్లాడుతున్నాడు. మధ్యలో ఉన్న యువకుడు సైతం ఫోన్‌లో నిమగ్నమై ఉన్నాడు. ఇక చివరన కూర్చున్న యువకుడు మహా ముదురులా ఏదో చేయబోయాడు. కానీ అడ్డంగా బుక్ చేశాడు. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన కాలిని స్కూటీ నెంబర్ ప్లేట్‌కి అడ్డుగా పెట్టాడు. అయితే, పోలీసులేం తక్కువనా. ఈ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ వాళ్లవద్ద నడవవు కదా! యువకుడికి ఝలక్ ఇస్తూ.. ఆ స్కూటీ ఓనర్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఒక్కొక్క ఉల్లంఘనను పేర్కొంటూ.. భారీ జరిమానా విధించారు. మొత్తంగా 3,200 చలాన్ పంపించారు.

కాగా, చలాన్ నుంచి తప్పించుకునేందుకు వీరు చేసిన ప్రయత్నాన్ని పేర్కొంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో మీమ్ విడుదల చేశారు. ఈ మీమ్‌లో పై భాగంలో ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్న యువకులు తమ బండి నెంబర్ ప్లేట్ కవరింగ్ చేసిన సమయంలో, ఆ తరువాత ఫోటోలను జత చేసి.. వాటి మధ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనకు విధించిన చలాన్‌ వివరాలను పేర్కొన్నారు. కింది భాగంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఎక్స్‌ప్రెషన్స్‌ను యాడ్ చేసి.. ఫన్నీ సెటైర్ వేశారు. ఈ సెటైరికల్ మీమ్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. పోలీసుల స్పాంటేనియస్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Cyberabad Traffic Police Tweet:

Also read:

Delhi Bonalu: దేశ రాజధాని ఢిల్లీ బోనమెత్తింది.. తెలంగాణ భవన్‌లో ఘనంగా ఉత్సవాలు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

Gopichand: సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో గోపిచంద్ సినిమా.. మరోసారి హ్యాట్రిక్ కాంబో రిపీట్..

తనకు కొత్త ఆధార్‌ నెంబర్‌ కేటాయించాలని హైకోర్టులో పిటిషన్‌.. యూఐడీఏఐ, కేంద్రానికి కోర్టు నోటీసులు

Latest Articles