Delhi Bonalu: దేశ రాజధాని ఢిల్లీ బోనమెత్తింది.. తెలంగాణ భవన్‌లో ఘనంగా ఉత్సవాలు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్‌ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో.. అంటూ తెలంగాణ భవన్‌ బోనమెత్తింది.

Delhi Bonalu: దేశ రాజధాని ఢిల్లీ బోనమెత్తింది.. తెలంగాణ భవన్‌లో ఘనంగా ఉత్సవాలు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు
Bonalu Celebrations In Telangana Bhavan At Delhi
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 14, 2021 | 5:02 PM

Bonalu Celebrations In Delhi Telangana Bhavan: దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్‌ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో.. అంటూ తెలంగాణ భవన్‌ బోనమెత్తింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అటు, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ, కేంద్రప్రభుత్వం తరపున బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఢిల్లీ తెలంగాణ భవన్‌ ఆధ్యాత్మిక కాంతుల్ని అద్దుకుంది. అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే సామూహిక ఉత్సవం బోనాల పండుగలో అంతా పాల్గొన్నారు. తెలంగాణ వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలు కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం అయ్యాయి.

బోనాల పండుగను ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో బోనాల జాతరను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. పంటలను రక్షించాలని, రోగాల నుంచి ప్రజలను రక్షించాలని అమ్మవారిని కోరుతూ ఈ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. కరోనా కారణంగా నిబంధనలు పాటిస్తూ బోనాల పండుగ జరుగుతోందని చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని, కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

ఇటు, తెలంగాణలో ఊరూ వాడా బోనాల జాతర కొనసాగుతోంది. హైదరాబాద్ అయితే బోనాలైతే వెరీ వెరీ స్పెషల్. అమ్మవారికి బోనంతో.. అత్యంత భక్తి శ్రద్దలతో మొక్కులు చెల్లిస్తారు భక్త జనం. ఈ ఆషాడంమంతా.. నేరుగా వెళ్లలేని భక్తులకు ఆన్‌లైన్‌లో దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నారు.

Read Also… Etela Rajendar: కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షా కలిసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. హుజూరాబాద్‌పై కీలక చర్చ