AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela Rajendar: కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షాను కలిసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. హుజూరాబాద్‌పై కీలక చర్చ

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత అమిత్‌ షాతో భేటీ కావడం ఇదే తొలిసారి.

Etela Rajendar: కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షాను కలిసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. హుజూరాబాద్‌పై కీలక చర్చ
Etala Rajender Meets Amit Shah
TV9 Telugu Digital Desk
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 14, 2021 | 5:15 PM

Share

Etala Rajender Meets Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత అమిత్‌ షాతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈటలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ కలిసి ఉన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై చర్చించారు. దీంతో పాటు హుజూరాబాద్ ఉపఎన్నికకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్న తీరును అమిత్ షాకు రాష్ట్ర నేతలు వివరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నామన్నారు. అలాగే, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగస్టు 9 నుంచి తలపెట్టిన పాదయాత్రకు సంబంధించి పూర్తి వివరాలను మంత్రి అమిత్ షాకు వివరించారు. ఈ యాత్రకు అమిత్ షాను రాష్ట్ర నాయకులు ఆహ్వానించినట్లు సమాచారం.

Read Also…  Hyderabad Gunfire: హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు గన్‌ఫైర్.. కాల్పులకు తెగబడ్డ సెక్యూరిటీ గార్డు..!