Aadhar Card: కొత్త ఆధార్‌ నెంబర్‌ కేటాయించాలని హైకోర్టులో పిటిషన్‌.. యూఐడీఏఐ, కేంద్రానికి కోర్టు నోటీసులు

Aadhaar card: ఆధార్ చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. మన సమాచారం మొత్తం ఆధార్ కార్డులో నిక్షిప్తమై ఉంటుంది. అందువల్ల ఆధార్ కార్డుతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది..

Aadhar Card: కొత్త ఆధార్‌ నెంబర్‌ కేటాయించాలని హైకోర్టులో పిటిషన్‌.. యూఐడీఏఐ, కేంద్రానికి కోర్టు నోటీసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 14, 2021 | 5:12 PM

Aadhaar card: ఆధార్ చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. మన సమాచారం మొత్తం ఆధార్ కార్డులో నిక్షిప్తమై ఉంటుంది. అందువల్ల ఆధార్ కార్డుతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డు విషయంలో అజాగ్రత్త వహిస్తే ఉచ్చులో పడిపోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఆధార్‌ వల్ల ఎన్నో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారవేత్త ఇతర కంపెనీల్లో తన ఆధార్‌ లింక్‌ కావడంతో తనకు కొత్త ఆధార్‌ నెంబర్‌ను కేటాయించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇలా వినియోగదారుని అనుమతి లేకుండా ఇతర కంపెనీలకు ఆధార్‌ లింక్‌ కావడంపై ఢిల్లీ హైకోర్టు తాజాగా కేంద్రానికి, యూఐడీఏఐకి నోటీసులు జారీ చేసింది. ఓ వస్త్ర వ్యాపారి రాజన్ అరోరాకు చెందిన ఆధార్ కార్డు నెంబర్ విదేశాల్లో రెండు కంపెనీలతో లింక్ అయ్యింది. దీంతో రాజన్‌ అరోరా కోర్టును సంప్రదించారు. ఆధార్ నెంబర్ యూరప్ కంపెనీలకు లింక్ కావడం వల్ల భవిష్యత్‌లో మనీ ల్యాండరింగ్, ఫోర్జరీ లేదంటే ఇతర మోసాలు జరిగే అవకాశం ఉందని రాజన్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే రాజన్‌ ప్రమేయం లేకుండానే ఆయన ఆధార్ నెంబర్ విదేశీ కంపెనీలతో లింక్ కావడం గమనార్హం.

అయితే విదేశీ కంపెనీలతో సంబంధం కలిగి ఉండటం వల్ల తన బిజినెస్‌కు దెబ్బతినే అవకాశం ఉందని రాజన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాజన్ అరోరా యూఐడీఏఐని సంప్రదించారు. కొత్త ఆధార్ నెంబర్ జారీ చేయాలని కోరగా, దీనికి యూఐడీఏఐ అంగీకరించలేదు. ఒక వ్యక్తికి కేవలం ఒక్క ఆధార్ నెంబర్ మాత్రమే కేటాయించడం జరుగుతుందని, మరో నెంబర్ ఇవ్వడం అనేక కుదరదని తేల్చి చెప్పింది. ఒక పౌరుడి ఇష్టానికి, తన అవసరాలకనుగుణంగా ఆధార్ నెంబర్ మార్చలేమని యూఐడీఏఐ తేల్చి చెప్పింది. దీంతో ఆయన న్యాయస్థానాన్నిసంప్రదించగా, కోర్టు కూడా ఈ అంశాన్ని అంగీకరించింది. అయితే యూఐడీఎఐకి ఒక విషయాన్ని తెలిపింది. సమస్య పరిష్కారం కోసం మార్గాన్ని తెలియజేయాలని కోరింది.

ఇవీ కూడా చదవండి:

India Post Payments Bank: పోస్టల్‌ బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌.. ఆగస్టు 1 నుంచి పెరగనున్న చార్జీలు

Jio: తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో.. తాజా నివేదిక విడుదల చేసిన ట్రాయ్‌