Pakistan Bus Blast: బాంబు దాడి.. కాదుకాదు గ్యాస్ పేలుడు.. పేలుడు ఘటనపై పాక్ – చైనా కీచులాట
పాకిస్తాన్ లో జరిగిన బస్సు పేలుడు ఘటన కొత్త మలుపు తిరిగింది. దీనిపై చైనా, పాకిస్తాన్ దేశాలు దాదాపు విమర్శించుకుంటున్నాయి. ఇది బాంబు దాడి అని చైనా అంటుండగా..
పాకిస్తాన్ లో జరిగిన బస్సు పేలుడు ఘటన కొత్త మలుపు తిరిగింది. దీనిపై చైనా, పాకిస్తాన్ దేశాలు దాదాపు విమర్శించుకుంటున్నాయి. ఇది బాంబు దాడి అని చైనా అంటుండగా..కాదని గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం జరిగిందని పాకిస్థాన్ చెబుతోంది. ఈ ఘటనలో 12 మంది మరణించారని, వీరిలో 9 మంది చైనీయులని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. ఈ ఎటాక్ కి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. పాక్ లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లో జరుగుతున్న హైడ్రోపవర్ డ్యాం నిర్మాణం కోసం 40 మంచి చైనా ఇంజనీర్లు, సర్వేయర్లు, మెకానికల్ స్టాఫ్ తో బాటు కొందరు పాక్ సైనికులు, వర్కర్లతో ఈ బస్సు వెళ్తుండగా పేలిపోయి లోయలో పడిపోయింది. మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల గ్యాస్ లీకై పేలిపోయిందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
కానీ దీనిపై చైనా విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి జావో లిజియన్ తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటిస్తూ ఇది ముమ్మాటికీ బాంబు దాడేనని అన్నారు. ఇందుకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్తానీయులు మరణించగా 28 మంది గాయపడ్డారు. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. అటు పాక్ లోని చైనీస్ ఎంబసీ కూడా బస్సు పేలుడు ఘటనను ఖండిస్తూ..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పాక్ ప్రభుత్వాన్ని గట్టిగా కోరింది. నిజానికి పాక్, చైనా మిత్ర దేశాలే అయినప్పటికీ ఈ సంఘటనతో వీటి మధ్య విభేదాలు రేగాయి. సుమారు 60 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడితో పాక్.చైనా ఈ హైడ్రో పవర్ డ్యాం నిర్మాణాన్ని చేబట్టాయి. అటు చైనీయులు, ఇటు పాకిస్తానీయవర్కర్లు కూడా ఈ నిర్మాణ పనుల్లో ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: వరకట్నంపై పోరు..రాజ్ భవన్ లో రోజంతా కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ దీక్ష.. కాంగ్రెస్, బీజేపీ మద్దతు