వరకట్నంపై పోరు..రాజ్ భవన్ లో రోజంతా కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ దీక్ష.. కాంగ్రెస్, బీజేపీ మద్దతు

వరకట్నాన్ని వ్యతిరేకిస్తూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తిరువనంతపురంలోని రాజ్ భవన్ లో బుధవారం రోజంతా దీక్ష చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు దీక్షను కొనసాగించారు.

వరకట్నంపై పోరు..రాజ్ భవన్ లో రోజంతా కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ దీక్ష.. కాంగ్రెస్,  బీజేపీ మద్దతు
Arif Mohammad Khan
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 14, 2021 | 7:21 PM

వరకట్నాన్ని వ్యతిరేకిస్తూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తిరువనంతపురంలోని రాజ్ భవన్ లో బుధవారం రోజంతా దీక్ష చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు దీక్షను కొనసాగించారు. ఇటీవల వరుసగా జరిగిన వరకట్న మరణాల ఘటనలతో రాష్ట్రం వేడెక్కింది. వరకట్న మరణాలు, మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ దక్షిణాది రాష్ట్ర గవర్నర్ ఒకరు దీక్ష చేయడం ఇదే మొదటిసారి. పెళ్లిళ్లలో డౌరీని తిరస్కరించాలంటూ ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు గవర్నర్ ఈ దీక్ష చేపట్టారని విపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు పేర్కొన్నారు. దీనికి వారు మద్దతు ప్రకటించారు. శతాబ్దాల తరబడి సాగుతున్న ఈ దురాచారానికి ప్రజలు నో చెప్పాలని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఈ సందర్భంగా కోరారు. గాంధేయ సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు తాను దీన్ని చేపట్టినప్పటికీ ఇతర స్వచ్చంద సంస్థలు కూడా వరకట్నానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వివాహాల సమయంలో ఎవరైనా వరకట్నాన్ని డిమాండ్ చేసినప్పుడు మహిళలు తిరస్కరించాలని ఈయన గత నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో భావోద్వేగంగా పిలుపునిచ్చారు. ఇటీవల కొల్లం జిల్లాలో విస్మయ అనే ఆయుర్వేద విద్యార్థిని తన భర్త ఇంట్లో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. అదనపు కట్నం కోసం తన భర్త, అత్తమామలు తనను టార్చర్ పెట్టారని ఆమె తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఇలాగే రాష్ట్రంలో పలు చోట్ల మహిళలు తమ అత్తమామలు, భర్తల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ విధమైన ఘటనలను నివారించడంలో పినరయి విజయన్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Anushka – Sakshi: అనుష్క, సాక్షి, ప్రియాంక, రితికా సజ్దేహ్ : టీమిండియా స్టార్ క్రికెటర్ల భార్యలు ఎంత వరకు చదివారో తెలుసా..!

Viral Video: అమ్మో బొమ్మ.. చూస్తే గుండె ఆగాల్సిందే.. నెట్టింట వీడియో హలచల్..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!