నందిగ్రామ్ ఎన్నిక ఫలితాలపై ఈసీకి కలకత్తా హైకోర్టు నోటీసు.. మమత పిటిషన్ పై తీర్పు ఎలా వస్తుందో..?
బెంగాల్ లోని నందిగ్రామ్ నియోజకవర్గం ఎన్నిక ఫలితాలపై కలకత్తా హైకోర్టు ఎన్నికల కమిషన్ కు నోటీసు జారీ చేసింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి చేతిలో బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
బెంగాల్ లోని నందిగ్రామ్ నియోజకవర్గం ఎన్నిక ఫలితాలపై కలకత్తా హైకోర్టు ఎన్నికల కమిషన్ కు నోటీసు జారీ చేసింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి చేతిలో బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్రంలో మిగతా చాలా చోట్ల టీఎంసీ ఘన విజయం సాధించింది. నందిగ్రామ్ లో తన ఓటమిని, ఈ ఫలితాలను సవాలు చేస్తూ మమత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సువెందు అధికారి ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ఆమె కోరారు. ఆన్ లైన్ ద్వారా ఈ పిటిషన్ ని విచారించిన జస్టిస్ షంపా సర్కార్…ఎన్నికల సంఘానికి, రిటర్నింగ్ అధికారికి నోటీసు జారీ చేయాలనీ ఆదేశించారు. అలాగే నందిగ్రామ్ నియోజకవర్గం లోని అన్ని పత్రాలు, ఈవీఎంలను భద్రపరచాలని కూడా సూచించారు. ఈ ఎన్నికలో సువెందు అధికారి లంచాలు ఇచ్చారని, కుల మతాల పేరిట వైషమ్యాలను రెచ్చగొట్టారని, బూత్ క్యాప్చరింగ్ వంటి అక్రమాలకు పాల్పడ్డారని మమత ఆన్ లైన్ ద్వారా కోర్టుకు తెలిపారు.
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఆగస్టు 12 న జరగాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇటీవల ఇదే కోర్టులో మమతా బెనర్జీ పిటిషన్ ను జస్టిస్ కౌశిక్ చందా విచారించినప్పుడు ఆయనపై తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన విచారణ నుంచి వైదొలిగారు. మమతకు 5 లక్షల జరిమానా విధించారు. ఒక జడ్జి ప్రతిష్టను దిగజార్చడానికి ఆమె ప్రయత్నించారని, రాజ్యాంగ బద్ద విధులను అతిక్రమించి ప్రవర్తించారని ఆయన అన్నారు. ఈ కేసును విచారించబోనంటూ వైదొలిగారు. అయితే ఈ జడ్జి బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్నారని..అందువల్ల పక్షపాత వైఖరి చూపవచ్చునని మమత కూడా ఆరోపించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: parliament: రాజ్యసభలో సభా పక్షనేతగా పీయూష్ గోయెల్, లోక్ సభలో రాహుల్ గాంధీ ..?
George w bush: ఆఫ్ఘనిస్తాన్ లో దళాల ఉపసంహరణ పొరబాటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్