AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balka Suman: బుల్డోజర్లు తెచ్చి తెలంగాణ ప్రజలను చంపుతారా?.. టీఆర్ఎస్ విప్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేతలు ఇందిరా పార్క్ దీక్షలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం అర్థరహితం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ మండిపడ్దారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఒక్క తెలంగాణలో జరిగినట్లు బీజేపీ నేతలు నీతులు చెబుతున్నారని విమర్శించారు.

Balka Suman: బుల్డోజర్లు తెచ్చి తెలంగాణ ప్రజలను చంపుతారా?.. టీఆర్ఎస్ విప్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
Balka Suman
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 17, 2022 | 4:27 PM

TRS Whip Balka Suman: బీజేపీ(BJP) నేతలు ఇందిరా పార్క్ దీక్షలో టీఆర్ఎస్(TRS) ప్రభుత్వంపై విమర్శలు చేయడం అర్థరహితం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ మండిపడ్దారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఒక్క తెలంగాణ(Telangana)లో జరిగినట్లు బీజేపీ నేతలు నీతులు చెబుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేతల సస్పెన్షన్ వివాదాలను దేశం అంతా చూసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొత్తేమీ కాదన్నారు. బీజేపీ బుల్డోజర్ల భాష వాడుతూ.. తెలంగాణ పల్లెల్లో విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలను చంపేందుకు బుల్డోజర్ల భాష వాడుతుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ద్రోహం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. ఉద్యమ ద్రోహులు అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రజలు గెలిపించారు కదా అని గుర్తు చేశారు. వీరంతా రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి సత్తా చాటారన్నారు.

మేము మిషన్ కాకతీయ ద్వారా కట్టిన చెరువులను, మేము కట్టిన ప్రాజెక్టులను కూల్చడానికి బీజేపీ బుల్డోజర్లు తెస్తుందా.. అంటూ ప్రశ్నించారు. బీజేపీ దమ్ముంటే కేంద్రం నుంచి 2 కోట్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తీసుకురావాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కండకావడంతో సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారని.. మీరు మా సీఎం కేసీఆర్ ని తిడితే మేం కూడా మీ పీఏం మోడీ, హోంమంత్రి అమిత్ షాను కూడా అసభ్యంగా తిట్టగటమని బాల్క సుమన్ హెచ్చరించారు. మోడీ, అమిత్ షాను చూస్తే తెలంగాణ బీజేపీ నేతల లాగులు తడుస్తాయంటూ ఎద్దేవా చేశారు. ఎందుకు విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. మేము ప్రజలకు చెక్కులు పెంచుతుంటే…బీజేపీ బుల్డోజర్లు ఎక్కిస్తా అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ నేతలు రక్కసు క్రియేట్ చేయాలని చూస్తున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు.

బీజేపీ దీక్షలు తెలంగాణ హైదరాబాద్ లో కాదు. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, ఉద్యోగాల కోసం ఢిల్లీలో చేయాలన్నారు. ఉత్తర భారతదేశంలో మాట్లాడినట్లు మాట్లాడి ప్రజలను రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. ఆనాడు కాంగ్రేస్‌కు పట్టిన గతే బిజేపికి పడుతుంది.. ఆనాడు కాంగ్రేస్ నాయకులు ఆంధ్రా నాయకులకు ఊడిగం చేస్తే.. ఇవ్వాళ టీ-బీజేపీ నాయకులు గుజరాత్ నాయకులకు ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుజరాత్ నాయకుల డైరెక్షన్ లోనే తెలంగాణ నాయకులు పనిచేస్తున్నారన్నారు. బీజేపీ నాయకులు మాటలు కాదు.. చేతల్లో చూపించాలన్నారు.

Read Also…  Crime news: నీ కడుపున పుట్టటమే నేను చేసిన తప్పా.?.. ఆ శిశువుకు మాటలొస్తే ఇలాగే అడిగేదేమో