AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: నీ కడుపున పుట్టటమే నేను చేసిన తప్పా.?.. ఆ శిశువుకు మాటలొస్తే ఇలాగే అడిగేదేమో

బిడ్డకు ఏదైనా కష్టం వస్తే కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అమ్మ ప్రేమకు విలువ కట్టేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నవమాసాలు మోసి జన్మనివ్వడమే కాదు ఇక తన తుది శ్వాస వరకు కూడా బిడ్డల కోసమే...

Crime news: నీ కడుపున పుట్టటమే నేను చేసిన తప్పా.?.. ఆ శిశువుకు మాటలొస్తే ఇలాగే అడిగేదేమో
Child
Ganesh Mudavath
|

Updated on: Mar 17, 2022 | 4:16 PM

Share

బిడ్డకు ఏదైనా కష్టం వస్తే కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అమ్మ ప్రేమకు విలువ కట్టేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నవమాసాలు మోసి జన్మనివ్వడమే కాదు ఇక తన తుది శ్వాస వరకు కూడా బిడ్డల కోసమే బ్రతుకుతూ ఉంటుంది తల్లి. పిల్లల సంతోషమే తన సంతోషం గా జీవిస్తుంది. అందుకే తల్లిని మించిన దైవం లేదు అని చెబుతారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం కొంత మంది తల్లి ప్రేమకు మాయని మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ విషయంలోనూ మృగాలుగా మారిపోయి దారుణంగా ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులను దారుణంగా తల్లులే ప్రాణాలు తీస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని లఖ్ నవూలో ఇలాంటి ఘటనే జరిగింది. తన కడుపున పుట్టిన బిడ్డను కన్న తల్లే సజీవంగా భూమిలో పాతి పెట్టింది.

బస్తీలోని జిల్లా ఆసుపత్రి పక్కనే ఈ ఘటన జరిగింది. జిల్లా ఆసుపత్రికి సమీపంలో ఓ మహిళకు చిన్నారి ఏడుపు వినిపించింది. ఆ మహిళ వెళ్లి చూసేసరికి ఆసుపత్రి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో, భూమిలో సగం పాతిపెట్టిన శిశువు కనిపించింది. వెంటనే ఆ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ బిడ్డను వెలికి తీశారు. శిశువును జిల్లా ఆసుపత్రిలోని పిల్లల వార్డుకు తరలించారు. చిన్నారికి వైద్యం అందించిన డాక్టర్లు శిశువు ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. శిశువును సజీవంగా పాతిపెట్టిన ఆ చిన్నారి తల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని శిశు సంరక్షణ అధికారులకు అప్పగించారు.

Also Read

Explained: త్వరలో గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రో ధరలు.. దీనికి కారణం ఏంటో తెలుసా?

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సర్కారు వారి పాట’ సెకండ్ సాంగ్ వచ్చేది అప్పుడే..

Viral Video: ఇన్‏స్టా రీల్ చేద్దామనుకున్నాడు.. కానీ.. పెంపుడు కుక్క దెబ్బకు ఫ్యూజులౌట్..