TS Govt Jobs: నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడకండి.. మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అంశంపై అధికార, విపక్షాల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

TS Govt Jobs: నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడకండి.. మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
Trs , Congress , Bjp In Telangana
Follow us

|

Updated on: Mar 17, 2022 | 5:11 PM

Telangana Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అంశంపై అధికార, విపక్షాల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోందని..నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) సూచించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కొలువులు కొట్టాలని ఆయన నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.నిరుద్యోగులు ఎవరూ విపక్షాల ట్రాప్‌లో పడొద్దని.. వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.  సీఎం కేసీఆర్(CM KCR) అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగ నియామకాలపై రాజకీయ దురుద్దేశంతోనే  ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  గతంలో పీల్డ్ అసిస్టెంట్లు కూడా బీజేపీ నాయకుల మాటలు విని మోసపోయారని అన్నారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి..  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు అధిక ప్రాధాన్యత కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న శాఖలకు అత్యధిక అవార్డులిచ్చింది కానీ ఒక్క రూపాయి కూడా నిధులివ్వక పోవడం బాధాకరమన్నారు. బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని హితవుపలికారు.

రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఉచితంగా MLAలు కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నారని  గుర్తుచేశారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

మిగతా లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి?.. దాసోజు శ్రావణ్… 

తెలంగాణ ఉధ్యమ ఆకాంక్ష లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్(Dasoju Sravan) ఆరోపించారు. 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. మరి మిగతా లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.  90 వేల ఉద్యోగాలు ఇచ్చి 39 లక్షల మంది నోట్లో సీఎం కేసీఆర్ మట్టి కొడుతున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ బృతి ని ఎవరు అడ్డుకుంటుంన్నారు? ఎందుకు అమలు చేయట్లేదు? అని ప్రశ్నించారు. చనిపోయిన ఫిల్డ్ అసిస్టెంట్‌ల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున సాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్‌లు  అందరికీ రెండు సంవత్సరాల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చదువుకున్న ప్రతి నిరుద్యోగి అన్ని పరిక్షలు రాసేలా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని దాసోజు ప్రభుత్వాన్ని కోరారు.

Also Read..

Buttermilk Benefits: ఆఫ్ట్రాల్ మజ్జిగ అనుకోకండి.. ఈ విషయాలు తెలిస్తే.. ‘అమ్మో సంజీవని’ అంటారు

Telangana: కరీంనగర్‌ గడ్డపై నిలబడి బండి సంజయ్‌కి కేటీఆర్‌ సవాల్..

Latest Articles