Telangana: కరీంనగర్‌ గడ్డపై నిలబడి బండి సంజయ్‌కి కేటీఆర్‌ సవాల్..

దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్‌పై బండి సంజయ్‌ పోటీ చేయాలంటూ సవాల్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. మంత్రి లక్ష మెజార్టీతో గెలిపించుకొని తామేంటో నిరూపించుకుంటామన్నారు. కరీంనగర్‌ టూర్‌లో ఉన్న మంత్రి.. బీజేపీ కార్పొరేటర్లను పార్టీలోకి ఆహ్వానించారు.

Telangana: కరీంనగర్‌ గడ్డపై నిలబడి బండి సంజయ్‌కి కేటీఆర్‌ సవాల్..
Minister Ktr
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 17, 2022 | 5:09 PM

Karimnagar: బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌(Bandi Sanjay) టార్గెట్‌ గానే మంత్రి కేటీఆర్‌(Ktr) కరీంనగర్‌ టూర్‌ సాగింది. బీజేపీ(Bjp)లో దూకుడు మీద ఉన్న బండికి చెక్‌ పెట్టేందుకు మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో పావులు కదుపుతున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. అందులో భాగంగా బీజేపీ కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లోకి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్‌. బండి సంజయ్‌కి దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్‌పై గెలువాలని సవాల్‌ చేశారు కేటీఆర్‌. పార్టీ తరుపున లక్ష మెజార్టీతో గంగులను గెలిపించుకుంటామని అన్నారు. “కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని బండి సంజయ్‌ ఎనాడైనా అడిగారా? నేతన్నల కోసం క్లస్టర్ అయినా తెప్పించారా? కరీంనగర్ యువత కోసం ఏం చేసినవ్‌? తెల్లారి లేస్తే హిందూ, ముస్లిం అంటావ్.. కనీసం గుడి అయినా తీసుకొచ్చారా?” అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.  తిమ్మాపూర్‌ మండలంలోని రేణికుంటలో టీఆర్‌ఎస్‌ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి.. 2లక్షల చెక్‌ను అందించారు కేటీఆర్. తర్వాత ర్యాలీగా కరీంనగర్‌కు వెళ్లారు. కార్పొరేషన్‌ పరిధిలో 410 కోట్లతో చేపట్టే మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులను, నగరంలో ప్రతి రోజు మంచి నీటి సరఫరా పథకానికి సంబంధించిన ఫైలాన్‌ను మంత్రి ఆవిష్కరించారు.

Also Read: Viral: రక్తవర్ణంతో వర్షం.. ఎర్రగా మారిన నీలాకాశం.. భయాందోళనలకు గురైన ప్రజలు