SC Railway: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే.. రూ. 10,000 కోట్ల ఆదాయం..

SC Railway: కరోనా (Corona) విపత్కర పరిస్థితులను సైతం ఎదుర్కొంటూ దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డును సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవానాలో గొప్ప మైలు రాయిని అధిగమించింది. జోన్‌ 2021-22 సంవత్సరంలో (2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి 17వ తేదీ వరకు) సరుకు రవాణాలో...

SC Railway: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే.. రూ. 10,000 కోట్ల ఆదాయం..
Sc Railway
Follow us

|

Updated on: Mar 17, 2022 | 6:17 PM

SC Railway: కరోనా (Corona) విపత్కర పరిస్థితులను సైతం ఎదుర్కొంటూ దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డును సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవానాలో గొప్ప మైలు రాయిని అధిగమించింది. జోన్‌ 2021-22 సంవత్సరంలో (2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి 17వ తేదీ వరకు) సరుకు రవాణాలో 112.51 మిలియన్‌ టన్నుల (ఎమ్‌టీల) లోడిరగ్‌ నిర్వహించడం ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అన్ని రకాల సరుకుల లోడిరగ్‌ అధిక స్థాయిలో జరగడంతో అన్ని రంగాలలో సరుకు రవాణాలో వృద్ధి సాధించింది. సరుకు రవాణాలో గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే 17.7 శాతం అధిక ఆదాయంతో పాటు 17.3 శాతం అధిక లోడిరగ్‌ను సాధించింది.

సరుకు రవాణా లోడిరగ్‌ పురోగతిలో బొగ్గు 53.78 ఎమ్‌టీల లోడిరగ్‌తో, సిమెంట్‌ 32.339 ఎమ్‌టీల లోడిరగ్‌తో, ఆహార ధాన్యాలు 7.980 ఎమ్‌టీల లోడిరగ్‌తో, ఎరువులు 5.925 ఎమ్‌టీల లోడిరగ్‌తో, కంటైనర్ల సేవలు 2.137 ఎమ్‌టీల లోడిరగ్‌తో, స్టీల్‌ ప్లాంట్ల కోసం ముడి సరుకు 4.14 ఎమ్‌టీల లోడిరగ్‌తో మరియు అల్మూనియా పౌడర్‌, ఫ్లైయాష్‌, గ్రానైట్‌, చెక్కర మొదలైనవి 5.80 ఎమ్‌టీల లోడిరగ్‌తో భాగస్వామ్యంగా ఉన్నాయి. సరుకు రవాణాలో వివిధ వినూత్న పథకాలు చేపట్టడం, పలు స్టేషన్ల మార్గాలలో మౌలిక సదుపాయాల కల్పనతో సహా సరుకు రవాణా నిర్వహణకు అనేక సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి చర్యలు తీసుకోవడం ఆదాయం పెరగడానికి కారణాలుగా చెప్పవచ్చు.

Scr

ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ సంజీవ్‌ కిశోర్‌ మాట్లాడుతూ.. ‘సరుకు రవాణా రంగంలో మెరుగైన రికార్డులను నమోదు చేయడం, రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడంలో అంకిత భావంతో కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే బృందానికి నా అభినందనలు. జోన్‌ సరుకు రవాణ లోడిరగ్‌ల ఆదాయంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇదే కృషిని కొనసాగించాలి’ అని సూచించారు.

Also Read: Russia-Ukraine War: అమెరికా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌కు ఆయుధ సహయంగా ‘స్విచ్‌బ్లేడ్స్ సూసైడ్ డ్రోన్లు’..?

Cyclone Asani: ఈ ఏడాది తొలి తుఫాన్‌ దూసుకొస్తోంది.. మార్చిన 21 తర్వాత ఆ ప్రాంతాల్లో భారీ వర్షం..

Krishna District: యాక్షన్‌లోకి దిగిన విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్.. వారికి వాటర్, డ్రైనేజీ కనెక్షన్లు కట్