TS SSC Exams: తెలంగాణాలో పరీక్షల తేదీలపై అభ్యంతరాలు.. టెన్త్ ఎగ్జామ్ డేట్స్ మార్చాలని టీపీఏ డిమాండ్

TS SSC Exams: తెలంగాణా(Telangana)లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు వాయిదా వేస్తూ ఎస్​ఎస్​సీ బోర్డు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(TPA) అభ్యంతరం తెలిపింది. అంతేకాదు పదో తరగతి పరీక్షలు ఏప్రిల్..

TS SSC Exams: తెలంగాణాలో పరీక్షల తేదీలపై అభ్యంతరాలు.. టెన్త్ ఎగ్జామ్ డేట్స్ మార్చాలని టీపీఏ డిమాండ్
Tenth Class Students
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2022 | 6:55 PM

TS SSC Exams: తెలంగాణా(Telangana)లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు వాయిదా వేస్తూ ఎస్​ఎస్​సీ బోర్డు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(TPA) అభ్యంతరం తెలిపింది. అంతేకాదు పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ లోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయని.. మండుటెండల్లో విద్యార్థులను ఎలా పరీక్షలు రాయమని చెబుతారంటూ టీపీఏ సంఘం మండిపడుతుంది.  అసలు విద్యా సంత్సరం ఏప్రిల్ 23 తో ముగుస్తుంటే.. ఏప్రిల్ నెలాఖరులో పరీక్షల నిర్వహణ ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విద్యార్థుల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో బోర్డు పునరాలోచించాని కోరుతుంది.

అంతేకాదు ఫీజుల నియంత్రణపై స్కూల్ లెవెల్ కమిటీలతో ఒరిగేదేమీ లేదని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం వ్యాఖ్యానిస్తోంది. తమిళనాడు తరహాలో మూడేళ్లకోసారి రాష్ట్ర స్థాయి కమిటీనే నిర్ణయించాలని డిమాండ్ చేస్తోంది. ఏటా 10శాతం ఫీజు పెంచుకునే వీలు స్కూల్స్ ఉండడం పై తీవ్ర అభ్యతరం తెలుపుతోంది తెలంగాణ తల్లిదండ్రుల సంఘం.

Also Read: Russia Ukraine Crisis: భారత్ వైఖరి అమెరికాతో సంబంధాలను ప్రభావితం చేయదు.. యుఎస్ కాన్సుల్ జనరల్ సుస్పష్టం

హొలీ ఆడుతున్నారా.. కళ్ళు, చర్మం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే