Holi Warning: హొలీ ఆడుతున్నారా.. కళ్ళు, చర్మం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే

Holi 2022: వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ.. హొలీ పండగను చిన్నా పెద్ద అంతా కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ (Covid)..

Holi Warning: హొలీ ఆడుతున్నారా.. కళ్ళు, చర్మం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే
Holi 2022 Warning
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2022 | 6:20 PM

Holi Warning: వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ.. హొలీ పండగను చిన్నా పెద్ద అంతా కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ (Covid) మహమ్మారి కారణంగా హోలీ వేడుకలపై నీలి నీడలు అలుముకున్నాయి. ఈ ఏడాది కొరోనా తగ్గుముఖం తగ్గుముఖం పట్టడంతో  మార్చి 18న జరిగే హొలీ కోసం ఎదురు చూస్తున్నారు.  అయితే రేపు జరుపుకోనున్న హొలీ సంబరాల్లో ఓ వైపు వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు(Health Care Tips) తీసుకోవాలని.. అంతేకాదు ఇతర అలెర్జీల బారిన పడకుండా తగిన జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

హోలీ రంగులు..  కళ్ల విషయంపై  ప్రముఖ రెటినాల్ సర్జన్ & యువెటిస్ స్పెషలిస్ట్ డాక్టర్ సమ్యక్ వి ముల్కుత్కర్ (Dr Samyak V Mulkutkar)  పలు సూచనలు సలహాలు చెప్పారు. హొలీ రంగులతో ఆడుకోవడం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అయితే కొన్ని రకాల రంగులు కళ్ళలోకి వెళ్తే.. కంటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు.  “హోలీలో ఉపయోగించే రంగులు రసాయన సమ్మేళనాలు, కలుషితాలను కలిగి ఉంటాయి. అవి సున్నితమైన కంటిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కార్నియా పై రసాయనాలు తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి. కొన్ని సమయాల్లో హోలీకి ఉపయోగించే పొడి రంగుల్లో ఫంగస్ ఉంటుంది. వీటి వలన కార్నియల్ అల్సర్‌ ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్ సమ్యక్ హెచ్చరిస్తున్నారు.

డాక్టర్ సందీప్ బుట్టన్ హొలీ వేడుకల్లో కళ్ళను సురక్షితంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రమాదకరమైన రంగులతో ఆడుకోవడం వల్ల కంటి చూపుని కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఒకొక్కసారి పొడి రంగులు కళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.. ఒకొక్కసారి విషపూరితంగా మారి కళ్ళకు ఎరుపు, దురద, చికాకు వంటి లక్షణాలను కలిగిస్తాయి. ముఖ్యంగా రసాయనిక రంగులతో ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని డాక్టర్ సందీప్ చెప్పారు.  హొలీ వేడుకల్లో హానికరమైన రంగులకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ హానికరమైన రసాయనాలు కలిగిన రంగులు  పింక్ ఐ (కండ్లకలక), దృష్టి లోపం ఏర్పడడానికి.. కారకాలు అవుతాయని.. ఒకొక్కసారి అంధత్వానికి కూడా దారి తీస్తాయని.. కనుక హొలీకి ఉపయోగించే రంగుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

“హోలీ రోజున ఉపయోగించే వాటర్ బెలూన్లు కూడా ఒకొక్కసారి కంటికి గాయాలు చేస్తాయి. ఈ బెలూన్లు.. వ్యక్తుల ముఖంపై నేరుగా తగిలి కళ్లకు కోలుకోలేని నష్టం కలిగిస్తాయి. ఒకొక్కసారి కంటికి గాయాలు అయ్యి.. ఆ గాయం నుంచి  రక్తస్రావం, కళ్ళు వాపు, లేదా రెటీనా డిటాచ్‌మెంట్‌కు దారితీయవచ్చు. ఈ పరిస్థితులు శాశ్వత దృష్టిని కోల్పోయేలా చేస్తాయని డాక్టర్ సందీప్ చెప్పారు.

ప్రమాదాల నివారణకు: హోలీ రోజున కంటిలో రంగులు పడితే.. కంటిని రబ్ చేయవద్దు. వెంటనే కళ్ళను శుభ్రమైన నీటితో కడగాలి. వైద్యుడిని సంప్రదించాలి. ఆలస్యం అయితే ఒకొక్కసారి కంటిపై ఆ గాయాలు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి.

కంటిలో రంగులు పడితే వాటిని చేతులతో తొలగించే ప్రయత్నం చేయవద్దు. కళ్ళను శుభ్రమైన నీటితో కడుక్కోవడంతో పాటు.. చేతుల్లో శుభ్రమైన నీరు తీసుకుని కంటి రెప్ప వేయండి. ఇలా చేయడం వలన కళ్లలోని రంగు కణాలను తొలగించి రసాయనాల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మ సంరక్షణ కోసం: కొన్ని సార్లు రంగులు చర్మానికి హానికరంగా మారతాయి. దద్దుర్లు వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ స్కిన్ డాక్టర్ కిరణ్ లోహియా చెప్పారు. అంతేకాదు “కృత్రిమ రంగులు.. చర్మంపై అలెర్జీ కారకాలని చెప్పారు. హొలీ అనంతరం చర్మంపై రంగులను తొలగించడానికి ప్రయత్నించే సమయంలో ఒకొక్కసారి దురద, దద్దుర్లు, వాపు ఏర్పడవచ్చు.

రంగులు గోళ్ళ క్రింద చిక్కుకుని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. స్కిన్ అలర్జీలు రాకుండా ఉండాలంటే.. హొలీ ముందు రోజు రాత్రి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  చర్మానికి స్కిన్ కేర్ కు సంబంధించిన లోషన్స్ కు దూరంగా ఉండాలి. అయితే హోలీ ఆడడానికి వెళ్ళే ముందు.. శరీరానికి కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ నూనెలను రాసుకోవడం చర్మం సురక్షితంగా ఉంటుంది.  చర్మాన్ని జిడ్డుగా చేయడం వలన రంగులు స్కిన్ లోపలికి వెళ్ళకుండా కాపాడతాయి ముఖం, చర్మానికి ఉన్న రంగులను సులభంగా తొలగించుకోవచ్చు.

అయితే హోలీకి ముందు.. తర్వాత కొన్ని వరకూ ముఖం, మెడ వంటి ప్రాంతాలకు ఎటువంటి లేజర్ చికిత్స తీసుకోవద్దు.  చర్మానికి కొన్ని రోజులు ఎటువంటి  స్క్రబ్స్ ను ఉపయోగించవద్దు అని డాక్టర్ కిరణ్ లోహియా చెప్పారు.

Also Read: Holi 2022: వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే హోళికా దహనం రోజు ఇలా చేయండి..

Holi 2022: రంగుల పండగలను..అందమైన, సులభమైన రంగోలి డిజైన్‌లతో అలంకరించుకోండి ఇలా.. సింపుల్ ఐడియాస్ మీకోసం