Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acidity: ఎసిడిటితో ఇబ్బంది పడుతున్నారా.. నిర్లక్ష్యం చేయకండి.. క్యాన్సర్‌కు దారితీయొచ్చు..

ప్రస్తుత జీవనశైలి కారణంగా ఎసిడిటీ(Acidity) సర్వసాధారణం అయిపోయింది. ఇది సాధారణంగా ఖాళీ కడుపుతో ఉండడం లేదా స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల వస్తుంది.

Acidity: ఎసిడిటితో ఇబ్బంది పడుతున్నారా.. నిర్లక్ష్యం చేయకండి.. క్యాన్సర్‌కు దారితీయొచ్చు..
Acidity
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 17, 2022 | 5:35 PM

ప్రస్తుత జీవనశైలి కారణంగా ఎసిడిటీ(Acidity) సర్వసాధారణం అయిపోయింది. ఇది సాధారణంగా ఖాళీ కడుపుతో ఉండడం లేదా స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల వస్తుంది. కొంతమందికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ(Tea) తాగడం వల్ల కూడా ఎసిడిటీ వస్తుంది. అయినప్పటికీ, చాలా మందిలో ఎసిడిటీ పెద్ద ప్రమాదం కాదు. కానీ ఇది తీవ్రమైన కడుపుకు సంబంధించిన వ్యాధులకు దారి తీస్తుంది. నిరంతర ఆమ్లత్వం గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) అనే వైద్య పరిస్థితికి సంకేతం కావచ్చు. GERD ప్రాణాంతకం కానప్పటికీ, సరైన సమయంలో చికిత్స చేయకపోతే మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. GRED లక్షణాలు ఎలా ఉంటాయంటే..

ఛాతి నొప్పి వస్తుంది. దగ్గు కూడా వస్తుంది. మింగడంలో ఇబ్బంది ఉంటుంది. గుండెల్లో మంటగా ఉంటుంది. అజీర్ణం, వికారం, వాంతులు, గొంతు మంట ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, GERD సంక్లిష్టతలకు దారితీయవచ్చు. అన్నవాహికలో ఆమ్లం పేరుకుపోవడం అన్నవాహిక వాపుకు కారణమవుతుంది. ఎసోఫాగిటిస్ ఫలితంగా మింగడం కష్టంగా ఉంటుంది. ఎసోఫాగిటిస్ చాలా కాలం పాటు చికిత్స చేయకుండా వదిలేస్తే అన్నవాహికకు పుండ్లు ఏర్పడతాయి. ఇది అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా పెంచుతుంది. జిడ్డు, కొవ్వు, అసిడిక్, స్పైసీ ఫుడ్స్ వల్ల అసిడిటీ వచ్చే అవకాశం ఉంది. పుదీనా, టొమాటో సాస్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, సిట్రస్, డార్క్ చాక్లెట్ వంటివి ఆమ్లత్వాన్ని ప్రేరేపిస్తాయి. అందుకే ఎసిడిటి ఉన్నవారు ఈ పదార్థలను చాలా వరకు తగ్గించుకోవాలి. మద్యం తాగకూడదు.

Read Also.. Pak vs Aus: డబుల్ సెంచరీ మిస్సయినా.. ప్రత్యేక జాబితాలో చేరిన పాక్ సారథి.. టాప్ 5లో టీమిండియా దిగ్గజ ప్లేయర్ కూడా..