Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buttermilk Benefits: ఆఫ్ట్రాల్ మజ్జిగ అనుకోకండి.. ఈ విషయాలు తెలిస్తే.. ‘అమ్మో సంజీవని’ అంటారు

వేసవి వచ్చిందంటే చాలు. మధ్యాహ్నం అలా బయటికి వెళ్లి వస్తే భానుడి ప్రతాపానికి అడ్డం పడాల్సిందే. ఈసారి మార్చి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి.

Buttermilk Benefits: ఆఫ్ట్రాల్ మజ్జిగ అనుకోకండి.. ఈ విషయాలు తెలిస్తే.. 'అమ్మో సంజీవని' అంటారు
Buttermilk
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 17, 2022 | 4:42 PM

Benefits Of Butter Milk: వేసవి వచ్చిందంటే చాలు. మధ్యాహ్నం అలా బయటికి వెళ్లి వస్తే భానుడి ప్రతాపానికి అడ్డం పడాల్సిందే. ఈసారి మార్చి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి(Summer) కాలంలో  చల్లటి మజ్జిగ తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది. మజ్జిగ.. శరీరం డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. మజ్జిగ జీర్ణ వ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  అలాగే నిర్జలీకరణంతో పోరాడుతుంది. ఇది మసాలా ఎక్కువగా వేసిన ఆహారం తిన్న తరువాత కడుపు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే, మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే, మజ్జిగ మీకు కరెక్ట్ అని చెప్పాలి. అనేక పోషకాలు, విటమిన్లు, ఐరన్, పొటాషియంతో నిండిన మజ్జిగను తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. కొద్దిగా జీలకర్ర పొడి, మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చి మిర్చి కలిపి నూరి మజ్జిగలో వేసి తాగితే ఇంకా మంచింది. మజ్జిగని ఎప్పుడైనా తాగచ్చు. మజ్జిగలో నీటి శాతం ఎక్కువ కాబట్టి బాడీలో వాటర్ బాలెన్స్ సరిగ్గా ఉంటుంది.

  1. మజ్జిగలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. చర్మంపై ఉన్న ట్యానింగ్ గుర్తులను పోగొడుతుంది.
  2. మజ్జిగలో లభించే ప్రో బయోటిక్ పేరు లాక్టిక్ యాసిడ్. చర్మంపై ముడతలు తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి – మజ్జిగలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, లాక్టోస్ ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి తోడ్పడతాయి.
  3. పొట్టలో గ్యాస్ బిల్డప్ అవ్వకుండా చూస్తుంది. స్టమక్ ఇంఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ని క్యూర్ చేస్తుంది.
  4. మజ్జిగలో బీకాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలం గా ఉన్నాయి. ఇవి ఎనీమియా నుండి కాపాడతాయి. ఇందులో ఉండే విటమిన్ డీ ఇమ్యూన్ సిస్టంని మెరుగుపరుస్తుంది
  5. మజ్జిగలో బయో యాక్టివ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి.
  6. టైమ్‌కి తినకపోవడం, సరైన ఫుడ్ తీసుకోకపోవడం వంటివి కాన్‌స్టిపేషన్ కి దారి తీస్తాయి.  రోజూ ఒక పెద్ద గ్లాస్ బటర్ మిల్క్ తాగుతూ ఉంటే ఈ సమస్యనించి సులభంగా బయట పడవచ్చు.
  7. మజ్జిగ లో లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియా పుష్కలం గా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ ని పెంచడమే కాక యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేస్తుంది.
  8. అజీర్తి, గ్యాస్ట్రో సమస్యలు, ఆకలి మందగించడం, స్ప్లీన్ సమస్యలు, ఎనీమియాకు మజ్జిగతో చెక్ పెట్టవచ్చు
  9.  జుట్టు సమస్యలను అధిగమించడానికి మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనితో, మీరు చుండ్రు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. కురులకు మజ్జిగను పట్టించి ఒక అరగంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు ఎంతో మృదువుగా తయారవుతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read: Viral: రక్తవర్ణంతో వర్షం.. ఎర్రగా మారిన నీలాకాశం.. భయాందోళనలకు గురైన ప్రజలు