Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana police: లాక్‌డౌన్‌లో రోడ్డెక్కితే.. కోర్టుకెళ్లాల్సిందే..! వాహనదారులకు పోలీసుల హెచ్చరిక..

Lockdown in Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. చాలాచోట్ల లాక్‌డౌన్ లాంటిదే కనిపించడం లేదు. కొంతమంది అనవసరంగా

Telangana police: లాక్‌డౌన్‌లో రోడ్డెక్కితే.. కోర్టుకెళ్లాల్సిందే..! వాహనదారులకు పోలీసుల హెచ్చరిక..
Telangana-Police
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 26, 2021 | 9:15 AM

Lockdown in Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. చాలాచోట్ల లాక్‌డౌన్ లాంటిదే కనిపించడం లేదు. కొంతమంది అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వారికి పోలీసులు గట్టి హెచ్చరికలు జారీచేశారు. లాక్‌డౌన్‌ సమయంలో అనవసరంగా వాహనాలతో రోడ్లపై తిరిగితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఈ-పాస్‌ లేకుండా తిరుగుతున్న వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకుంటున్నారు. అలా సీజ్ చేసిన వాహనాల్ని లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు తమ అధీనంలోనే ఉంచాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అలా పట్టుబడిన వాహనాలు రోజుల తరబడి వినియోగించక దెబ్బతినే అవకాశాలున్నాయని.. అందరూ గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. కొంతమంది అనవసరంగా బయట తిరుగుతున్నారని.. కఠిన చర్యలు తీసుకోక తప్పదని పేర్కొంటున్నారు.
సీజ్ చేసిన వాహనాలను లాక్‌డౌన్‌ అనంతరం న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. ఆ వాహనంపై గత లాక్‌డౌన్‌లోనూ ఉల్లంఘనలుంటే.. ‘రిపీటెడ్‌ అఫెండర్లు’ గా పరిగణించి అదనంగా కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కావున వాహనం సీజ్ అయిన వాహనదారులు కోర్టు మెట్లాక్కిల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అక్కడ న్యాయమూర్తి విధించే జరిమానా చెల్లించి ఆ రసీదుని పోలీస్‌ స్టేషన్‌లో చూపించి.. వాహనాన్ని తీసుకోవాలి. అయితే.. అలాంటి వాహనాలపై గతంలో జారీ అయిన ఈ-చలానాల బకాయిలుంటే వాటినీ చెల్లించాకే పోలీసులు వాహనాన్ని వదిలిపెడతారు. అయితే.. లాక్‌‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేసేందుకు పోలీసులు ప్రణాళిక రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.