Yaas Cyclone Effect: రవాణా వ్యవస్థపై ‘యాస్’ తుపాను ప్రభావం.. కోల్‌కతాలో కదలని రైళ్లు, నిలిచిన విమానాలు..!

‘యాస్’ తుపాను ముంచుకొస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భారీ తుఫాను ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది.

Yaas Cyclone Effect: రవాణా వ్యవస్థపై ‘యాస్’ తుపాను ప్రభావం.. కోల్‌కతాలో కదలని రైళ్లు, నిలిచిన విమానాలు..!
Kolkata Airport Suspends Flight Operations Long Distance Trains Cancelled
Follow us

|

Updated on: May 26, 2021 | 7:24 AM

Yaas Cyclone Effect: ‘యాస్’ తుపాను ముంచుకొస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భారీ తుఫాను ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది. ముఖ్యంగా విమానాలు, రైళ్ల రాకపోకలపై ఆంక్షలు విధించింది బెంగాల్ ప్రభుత్వం. తుపాన్ వల్ల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలోని విమానాశ్రయాన్ని బుధవారం మూసివేశారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7.45 గంటల వరకు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు కోల్‌కతా విమానాశ్రయ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం వల్ల విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేసినందున ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కోల్‌కతా విమానాశ్రయ అధికారులు ట్వీట్ చేశారు.

యాస్ తుపాన్ వల్ల విమాన సర్వీసులను రద్దు చేసినందున టికెట్లు బుక్ చేసుకున్న విమాన ప్రయాణికులకు రిఫండ్ చేస్తామని ఇండిగో ట్వీట్ చేసింది. తుపాన్ ముప్పు వల్ల కోల్‌కతా కేంద్రంగా 38 రైళ్లను రద్దు చేశామని భారత రైల్వే అధికారులు చెప్పారు. మే 24 నుంచి మే 29వతేదీ వరకు రైళ్ల రద్దు వల్ల ముందుగా టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు తిరిగి డబ్బులు చెల్లిస్తామని రైల్వే అధికారులు చెప్పారు.ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 13 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు రాష్ట్ర బృందాలు సహాయకచర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు.

Read Also…  Hospital Aggression: నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం.. డబ్బులు కట్టలేదని కరోనా బాధితురాలికి ఆక్సిజన్ కట్..!

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..