AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Yaas: తీరానికి చేరువైన తుఫాన్ … నేడు ఒడిశాలోని భద్రక్‌ వద్ద విరుచుకుపడనున్న‘యాస్‌’

Cyclone Yaas: బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను ‘YAAS’ ఒడిశా తీరానికి దగ్గరగా వస్తోంది. పెద్ద ఎత్తున ప్రభావం చూపించేందుకు రెడీ అవుతోంది. అయితే ఒడిశా భద్రక్‌ జిల్లాలో ధామ్రా ఓడరేవు సమీపంలో..

Cyclone Yaas: తీరానికి చేరువైన తుఫాన్ ... నేడు ఒడిశాలోని భద్రక్‌ వద్ద విరుచుకుపడనున్న‘యాస్‌’
Odisha Coast Cyclone Yaas
Sanjay Kasula
|

Updated on: May 26, 2021 | 8:14 AM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ యాస్ మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. అతి తీవ్ర తుఫాన్‌గా ఆవిర్భవించింది. అతి తీవ్ర తుపాను ‘YAAS’ ఒడిశా తీరానికి దగ్గరగా వస్తోంది. పెద్ద ఎత్తున ప్రభావం చూపించేందుకు రెడీ అవుతోంది. తుఫాన్ తీరాన్ని దాటే సమయానికి మరింత భీకరంగా మారడానికి అనుకూల వాతవరణం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో ఇప్పటికే ఒడిశా తీర ప్రాాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేంద్రపార, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లో 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నట్లు IMD తెలిపింది.

అయితే ఒడిశా భద్రక్‌ జిల్లాలో ధామ్రా ఓడరేవు సమీపంలో తీరాన్ని దాటే  ఛాన్స్ ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఇప్పటికే ప్రకటించింది. ఆ జిల్లాలోని ధామ్రా-చాంద్‌బలి మధ్య ఇది భూమిని తాకుతుందని భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించారు. మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా రూపు మార్చుకున్న ‘యస్‌’.. కారణంగా చాంద్‌బలి ప్రాంతానికి అత్యంత ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని IMD డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.

తుఫాన్ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ.. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోన్నారు. అయితే IMD అంచనాలకు తగ్గట్టుగానే ‘యస్‌’ తుపాను క్రమంగా తీవ్రమై మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారింది. దీంతో ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాత్రి 8.30 గంటలకు IMD విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇది ఒడిశాలోని పారాదీప్‌కి 160 కి.మీ. దూరంలో, ఆ రాష్ట్రంలోని బాలాసోర్‌కి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 240 కి.మీ., సాగర్‌ ద్వీపానికి 230 కి.మీ.దూరంలో ఉంది. గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది.

‘YAAS’తుఫాన్ ధామ్రా పోర్టుకు ఉత్తరంగా, బాలాసోర్‌కు దక్షిణంగా ఉన్న ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నానికి తీరం దాటుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సమయంలో గంటకు 185 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్‌ తీర ప్రాంతంపై కూడా అధిక ప్రభావం ఉంటుందని ఐఎండీ హెచరించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల తీరప్రాంతాల్లో గాలుల ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయం కూడా తుపాను ప్రభావం ఉంటుంది. ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాల వెంబడి, అలాగే మధ్య బంగాళాఖాతంలో సముద్రం అసాధారణ రీతిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌

 FINANCIAL PACKAGE: కరోనా తాకిడికి ఆర్థిక రంగం కుదేలు.. ఉద్దీపన ప్యాకేజీ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం!

కోవిద్ కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు, అలహాబాద్ హైకోర్టు తీర్పును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు