కోవిద్ కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు, అలహాబాద్ హైకోర్టు తీర్పును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు

కోవిద్ కారణాలు చూపి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వరాదని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.

కోవిద్ కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు, అలహాబాద్ హైకోర్టు తీర్పును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు
Supreme Court
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 25, 2021 | 5:41 PM

కోవిద్ కారణాలు చూపి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వరాదని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. ముందస్తు బెయిల్ అన్నది ఆ యా వ్యక్తుల నేర స్వభావాన్ని బట్టి ఉంటుందని దాన్ని ఇతర కోర్టులు ముందస్తు మాటగా వినియోగించుకోరాదని పేర్కొంది. కోవిద్ కేసులు పెరిగిపోయిన నేపథ్యంలోనూ, జైళ్లు కిక్కిరిసి పోతున్నందున మరణిస్తామేమోనని ఎవరైనా భయపడినప్పుడు ముందస్తు బెయిలును మంజూరు చేయవచ్చునని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యూపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. తనపై 130 పోలీసు కేసులున్న ప్రతీక్ జైన్ అనే నిందితుడిని వచ్చే ఏడాది జనవరి లోగా విడుదల చేయాలని అంటూ హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే యూపీ సర్కార్..కోవిద్ కారణంగా మరణిస్తామోనన్న భయం ఓ తప్పుడు సాకుగా కనబడుతోందని, ఇతర కోర్టులు కూడా ఇలాగే యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉందని పేర్కొంది. అటు జైళ్లలోనూ కోవిద్ కేసులు పెరిగిపోతున్నాయని, నిందితులు, జైలు సిబ్బంది, పోలీసులు కూడా రిస్క్ లో పడుతున్నారని ఇటీవల అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కొంత నిర్దిష్ట కాలానికి నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చునని అభిప్రాయపడింది.

కాగా బెయిల్ గానీ, పెరోల్ గానీ పొందిన ఖైదీలను విడుదల చేయాలనీ, కానీ వారివారి నేర స్వభావాన్ని, వారి నేరం తీరుపై ఇది ఆధారపడి ఉండాలని గత ఏడాది సుప్రీంకోర్టు పేర్కొంది. బహుశా ఆ నేపథ్యంలో అలహాబాద్ కోర్టు ఈ తీర్పు ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ  చూడండి: Mia Khalifa: పాకిస్తాన్ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేసిన మాజీ పోర్న్ స్టార్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

Viral Video: తినేట‌ప్పుడు కూడా ఫోన్‌లో ముఖం పెట్టిన వ్య‌క్తి.. అత‌డి భార్య ఎలా తిక్క కుదిర్చిందో చూడండి