Covaxin Second Dose: ఇవాళ్టి నుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌

Covid Vaccine: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బుధ, గురువారాల్లో కొవాగ్జిన్‌ రెండో డోసు వేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్నామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌...

Covaxin Second Dose: ఇవాళ్టి నుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌
Covid Vaccine
Follow us
Sanjay Kasula

|

Updated on: May 26, 2021 | 6:53 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బుధ, గురువారాల్లో కొవాగ్జిన్‌ రెండో డోసు వేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్నామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అన్నారు. జూన్‌ 15 తర్వాత కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లను బట్టి కొవిషీల్డ్‌ రెండో డోసు ప్రారంభిస్తామని  తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ… కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం 3-4 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. కంట్లో వేసే మందుతో ఎవరికైనా నష్టం కలిగిందా అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. శుక్రవారంలోగా దీనిపై స్పష్టత వస్తుందని అభిప్రాయ పడ్డారు.

అయితే ఇంతవరకూ రాష్ట్రంలో 252 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు గుర్తించామని, దీని కారణంగా మరణాలు సంభవించినట్లు సమాచారం లేదన్నారు. యాస్‌ తుఫాన్‌ నేపథ్యంలో కేంద్రం నుంచి రోజువారీ కేటాయింపుల కంటే అదనంగా గత 24గంటల్లో 767 టన్నుల ఆక్సిజన్‌ తీసుకున్నామని చెప్పారు.

మరోవైపు తెలంగాణలోనూ టీకా కార్యక్రమం  జరుగుతోంది. కొవాగ్జిన్‌ రెండో డోసు వారికే పంపిణీ చేయనున్నారు. నెలాఖరు వరకు 2.50 లక్షల మందికి టీకాలు వేస్తారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో సోమవారం నుంచి టీకా పంపిణీని తిరిగి మొదలైంది. అయితే, కేవలం రెండో డోసు వారికి.. అది కూడా కొవాగ్జిన్‌ తీసుకోవాల్సిన వారికే ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 2.20 లక్షల కొవిషీల్డ్‌ డోసులు, 50 వేల కొవాగ్జిన్‌ డోసులున్నాయి. కొవాగ్జిన్‌ రెండో డోసును 28 రోజుల తర్వాత నుంచి తీసుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఈ టీకా రెండో డోసు పొందాల్సినవారు 2.50 లక్షలమంది ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో లక్షన్నర నుంచి 2 లక్షల కొవాగ్జిన్‌ డోసులు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడ చవండి :  FINANCIAL PACKAGE: కరోనా తాకిడికి ఆర్థిక రంగం కుదేలు.. ఉద్దీపన ప్యాకేజీ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం!

కోవిద్ కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు, అలహాబాద్ హైకోర్టు తీర్పును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు