Yaas Cyclone: తెలుగు రాష్ట్రాల వైపు దూసుకువస్తున్న ‘యాస్’ తుపాను.. తీరంలో అల్లకల్లోలం.. అధికారుల రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ‘యాస్’ తుపాను దూసుకొస్తోంది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో.. ధామ్రా ఓడరేవు సమీపంలో తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది.
Yaas Cyclone Effect: బంగాళాఖాతంలో ‘యాస్’ తుపాను దూసుకొస్తోంది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో.. ధామ్రా ఓడరేవు సమీపంలో తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. ‘యాస్’ తుపాను కారణంగా చాంద్‌బలి ప్రాంతానికి అత్యంత ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టుగానే ‘యాస్’ తుపాను క్రమంగా తీవ్రమై, మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారింది. దీంతో ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కి 160 కి.మీ. దూరంలో, బాలాసోర్‌కి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 240 కి.మీ., సాగర్ ద్వీపానికి 230 కి.మీ.దూరంలో ఉంది. గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ‘యాస్’ తుపాను ధామ్రా పోర్టుకు ఉత్తరంగా, బాలాసోర్‌కు దక్షిణంగా ఉన్న ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నానికి తీరం దాటుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సమయంలో గంటకు 185 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
#WATCH | West Bengal: Barrackpore in North 24 Parganas experiences a weather change, receives light to moderate rainfall and wind.
The ‘very severe cyclonic storm’ #CycloneYaas is expected to make landfall by noon today with wind speed of 130-140 kmph gusting up to 155 kmph. pic.twitter.com/xxbQXXLMs1
— ANI (@ANI) May 26, 2021
మరోవైపు, జార్ఖండ్, బీహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో 115 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల తీరప్రాంతాల్లో గాలులు ఉద్ధృతంగా వీస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో తీర ప్రాంతాల నుంచి 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
#WATCH Odisha | Chandipur, Balasore witnesses heavy rainfall & strong winds.#CycloneYaas over northwest Bay of Bengal, about 40 km east of Dhamra (Odisha), 90 km south-southwest of Digha (West Bengal) & 90 km south-southeast of Balasore (Odisha), as per IMD update at 6:45 am. pic.twitter.com/vlYUFSZjUA
— ANI (@ANI) May 26, 2021
ఇటు తమిళనాడులోనూ కుండపోత వానలు కురుస్తున్నాయి. కన్యాకుమారి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతం అవుతోంది. జిల్లాలో కురిసిన వర్షాలకు పలు చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వరద ప్రభావానికి పలు గ్రామాలు నీటమునిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. కరెంట్ తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం తో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వరద నీటిలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సహాయక చర్యలను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులను ఆదేశించారు.
#CycloneYaas is ‘very likely’ to move north-northwestwards to reach near north Odisha coast close to north of Dhamra & south of Balasore by noon today, as a ‘very severe cyclonic storm’ with wind speed of 130-140 kmph (issued at 0300 hrs): India Meteorological Department (IMD) pic.twitter.com/iiHZxuOz1I
— ANI (@ANI) May 25, 2021