Pregnant Woman: గర్భిణులపై కరోనా పంజా.. ప్రతీ ముగ్గురిలో ఒకరికి పాజిటివ్..
Pregnant ladies facing hard situation: దేశమంతటా కరోనా సెండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం నాలుగువేలకు పైగా మరణాలు.. లక్షలాది కేసులు నమోదవుతన్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోవిడ్ బారిన పడే గర్భవతుల సంఖ్య నానాటికీ
Pregnant ladies facing hard situation: దేశమంతటా కరోనా సెండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం నాలుగువేలకు పైగా మరణాలు.. లక్షలాది కేసులు నమోదవుతన్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోవిడ్ బారిన పడే గర్భవతుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. అయితే.. కొవిడ్ సోకిన గర్భవతులకు ఆక్సిజన్ అవసరం పెరుగుతుందని జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఈ మేరకు చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అబ్ స్ట్రెక్స్ అండ్ గైనకాలజీ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ విజయ పలు విషయాలను వెల్లడింాచరు. గత ఏడాది ఒక్క గర్భిణీకి కూడా ఐసీయూ అవససరం రాలేదని డైరెక్టర్ విజయ పేర్కొన్నారు. తొలి వేవ్ (ఆరు నెలల కాలం) లో 800 మంది గర్భవతులకు చికిత్స చేశామని వెల్లడించారు. అయితే చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా ప్రమాదం నుంచి సులభంగా బయటపడవచ్చని వైద్య నిపుణలు సూచిస్తున్నారు.
ప్రతీ ముగ్గురిలో.. ఒకరు.. అయితే.. సెకండ్ వేవ్ లో ప్రతీ ముగ్గురు గర్భవతుల్లో ఒకరు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణవుతున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్-మే 2021 కాలంలో.. ప్రతీరోజు ఇద్దరు గర్భిణీలకు ఐసీయూ అవసరం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కాలంలో దాదాపుగా 200 మంది గర్భవతులకు చికిత్స చేయగా వారిలో 60 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలిందన్నారు. ఈ మేరకు గర్భవతులు, పాలిచ్చే తల్లులకు టీకా ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదంటూ సూచించారు.
ప్రభావం.. కాగా.. గర్భవతులకు కొవిడ్ సోకితే ఆ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని అమెరికాలోని వైద్య సంస్థ మాయో క్లినిక్ పేర్కొంది. శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో పాటు గర్భవతికి ఐసీయూలో చికిత్స అందించాల్సిన అవశ్యకత ఏర్పడే అవకాశముంటుందని వెల్లడించింది. డయాబెటిస్ ఉన్న గర్భవతులకు కొవిడ్‌తో ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచించారు. కొన్ని పరిశోధనల్లో కొవిడ్ సోకడం కారణంగా ప్రీమెచ్యూర్ డెలివరీలు అయ్యే అవకాశం కూడా ఉందని పలు వివరాలను వెల్లడించింది.
Also Read: