William Shakespeare: తొలి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న షేక్స్‌పియర్ కన్నుమూత.. అనారోగ్యంతో..
First Covid-19 vaccinated Shakespeare died: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అంతటా
First Covid-19 vaccinated Shakespeare died: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే.. ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పురుషుడిగా రికార్డు నెలకొల్పిన బ్రిటన్‌కు చెందిన విలియం షేక్స్‌పియర్ (81) మంగళవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన మరణించారు. వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో షేక్స్‌పియర్ మృతి చెందినట్లు బ్రిటన్ మీడియా వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 8న ఆయన ఫైజర్ టీకా తీసుకున్నారు. ఆయన కంటే ముందు 91 ఏండ్ల మహిళ మార్గరేట్ కీనన్ కరోనా టీకా తీసుకుని రికార్డు నెలకొల్పారు. అయితే.. పురుషుల్లో మొదట టీకా తీసుకున్న వ్యక్తిగా మాత్రం షేక్స్‌పియర్ ఉన్నారు.
ఇదిలాఉంటే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బుధవారం ఉదయం వరకు కరోనా కేసుల సంఖ్య 16,85,13,226 చేరగా.. ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 34,99,417 కి పెరిగింది. కోవిడ్ నుంచి ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 15,00,17,648 కి చేరింది.
Also Read: