Anandayya Natumandu: ఆనందయ్య నాటు మందుతో దుష్పరిణామాలు.. నెల్లూరు ఆసుపత్రిలో పెరుగుతున్న బాధితుల సంఖ్య..?

ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్‌ పరిశోధన ఎటూ తేలడం లేదు. ప్రస్తుతానికి మందు తీసుకున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు అధికారులు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Anandayya Natumandu: ఆనందయ్య నాటు మందుతో దుష్పరిణామాలు.. నెల్లూరు ఆసుపత్రిలో పెరుగుతున్న బాధితుల సంఖ్య..?
Side Effects Of Nellore Anandayya Natumandu
Follow us
Balaraju Goud

|

Updated on: May 26, 2021 | 8:51 AM

Anandayya Natumandu Side Effects: ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్‌ పరిశోధన ఎటూ తేలడం లేదు. ప్రస్తుతానికి మందు తీసుకున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు అధికారులు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ అభిప్రాయ సేకరణలో అవరోధాలు ఎదురవుతున్నాయి. మందు వాడిన 500 మందిని ఫోన్‌ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు అధికారులు. వారిలో 92 మంది ఫోన్‌ లిఫ్ట్ చేయలేదంటున్నారు ఆయుర్వేద వైద్యులు. 42 మంది మందే తీసుకోలేదని చెప్పారు. 36 మంది రోగుల జాబితాలో ఒకటే ఫోన్‌ నెంబర్ ఉంది.

మందు తీసుకున్న వారిలో ఎక్కువ మంది కరోనా రాకముందే మందు తీసుకున్నట్టు వెల్లడైంది. ఇప్పటి వరకూ మందు తీసుకున్న వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. మరిన్ని నెంబర్లు పంపాలంటూ నెల్లూరు అధికారులను కోరారు వైద్యులు. రోగుల నుంచి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వస్తేనే తర్వాత పరిశోధన ఉంటుందన్నారు వైద్యులు. దీంతో ఈ ఆనందయ్య మందుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి.. మరికొంత ఆలస్యం అవకాశం ఉంది.

మరోవైపు, కరోనా నివారణ పేరుతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఇచ్చిన నాటుమందుతో పలువురు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 36 మంది ఈ మందు తీసుకున్న తరువాత చోటుచేసుకున్న దుష్పరిణామాలకు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. వీరిలో పలువురికి ఆక్సిజన్‌ స్థాయి ప్రమాదకరంగా పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వీరికోసం ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేసి మరీ చకిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే శుక్రవారం ఈ మందు తీసుకున్న వారిలో ఆరుగురు మరణించారు. మృతి చెందిన వారిని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి కూడా తీసుకువచ్చినట్లు తెలిసింది. అప్పటికే మరణించి ఉండటంతో ఆస్పత్రిలో చేర్చుకోకుండా వారిని వెనక్కి పంపినట్లు సమాచారం. ఆస్పత్రిలో చనిపోతే మార్చురీలో ఉంచి, విఆర్‌ఒ సంతకం చేసిన తరువాతే మృత దేహాలను బంధువులకు ఇస్తారు. అలా జరగకపోవడంతో వీరికి సంబంధించిన రికార్డులు కూడా ఆస్పత్రిలో లేవు. ఇదే విషయాన్ని ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి.. తన తెలకపల్లి మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, మరణించిన వారు పశ్చిమగోదావరి, కృష్ణా, తూర్పు గోదావరిజిల్లాలకు చెందిన వారని సమాచారం. ఆనందయ్య నాటుమందు గురించి జరిగిన ప్రచారంతో అంబులెన్స్‌ల్లో వీరిని తీసుకువచ్చారని, మందు తీసుకున్న తరువాత పరిస్థితి మెరుగుపడకపోగా, మరింతగా విషమించడంతో వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారని తెలిసింది. అప్పటికే పరిస్థితులు చేయిజారి పోవడంతో ప్రభుత్వాస్పత్రి వైద్యులు సైతం ఏమీ చేయలేకపోయారు. నాటుమందు పంపిణీ వివాదాస్పదంగా మారడంతో ఈ విషయం గురించి ఆస్పత్రి సిబ్బంది పెదవివవిప్పడం లేదు. ప్రారంభంలో ఒకరిద్దరుగా ఉన్న ఆనందయ్య నాటుమందు బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు, ఆనందయ్య నాటు మందు బాధితులు క్రమంగా పెరుగుతుండంతో అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను పంపినట్లు తెలిసింది. ముఖ్యంగా రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య ఆరోగ్య స్థితితో పాటు, మిగిలిన వారి ఆరోగ్య సమస్యలను కూడా వివరించినట్లు తెలిసింది. అయితే, ఈ పరిణామాలను బహిరంగంగా ప్రకటించడానికి గానీ, మీడియాకు చెప్పడానికి గానీ అధికారులు ముందుకు రావడం లేదు. మొత్తం విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు.

Read Also…  Corona: కొత్త లక్షణాలతో వ్యాపిస్తున్న కరోనా.. సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!