Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Yaas: మీరు కూడా తుఫాన్ కదలికలను తెలుసు కోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

Cyclone Yaas Live Tracker: తుఫాన్ కదలికల గురించి తెలుసు కోవాలంటే చాలా ఈజీ. ఎందుంటే IMD సహకారంతో ఓ సెర్చ్ మ్యాప్‌ను తీసుకొచ్చింది.

Cyclone Yaas: మీరు కూడా తుఫాన్ కదలికలను తెలుసు కోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
Cyclone Yaas India's Gis M
Follow us
Sanjay Kasula

|

Updated on: May 26, 2021 | 9:22 AM

దూసుకొస్తున్న యాస్ తుఫాన్‌ను ఎలా గుర్తించాలి.. ఏదైన సఫ్ట్‌వేర్ ఉందా.. మ్యాప్‌లో ఈజీగా చూడవచ్చా..? ఇలా చాలా సందేహాలను నివ్రుతి చేసేందుకు ఇండియన్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) సాఫ్ట్‌వేర్ & సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎస్రి ఇండియా ఓ లైవ్ పాత్ తీసుకొచ్చింది. తుఫాన్ ఎలా కదులుతోందో నేరుగా మనం కూడా చూడొచ్చు. యాస్ లైవ్ పాత్ తుఫానును అనుసరించడానికి ఒక మ్యాప్‌ను రూపొందించింది. తుఫానును ట్రాక్ చేయడానికి మీరు దీన్ని ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ ఉంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను ‘యస్‌’.. ఒడిశాలోని భద్రక్‌ జిల్లాలో ధామ్రా ఓడరేవు సమీపంలో తీరాన్ని దాటనుందని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది. ఆ జిల్లాలోని ధామ్రా-చాంద్‌బలి మధ్య ఇది భూమిని తాకుతుందని భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే..  తుఫాను ఎటు నుంచి ఎటువైపుకు కదులుతోందో సామన్యులు సైతం తెలుసు కోవడం… అది వెళ్తున్న మార్గం.  ఇతర తాజా సమాచారం తెలుసు కోవడం కూడా అంతే ముఖ్యం.

ఇందు కోసం ఇండియన్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GIS) సాఫ్ట్‌వేర్ & సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎస్రి ఇండియా, యాస్ లైవ్ పాత్ తుఫానును అనుసరించడానికి ఒక మ్యాప్‌ను రూపొందించింది. ఈ మ్యాప్ ఆర్క్‌జిస్ ఆన్‌లైన్ ఎస్రి అందించిన మ్యాపింగ్ అండ్ అనలిటిక్స్ సిస్టమ్‌తో నిర్మించబడింది. ఇందుకు సంబంధించిన  ఇన్‌పుట్‌లను IMD (ఇండియన్ మెటీరోలాజికల్ డిపార్ట్‌మెంట్)  అందిస్తోంది.

ఈ మ్యాపింగ్‌లో తుఫాన్ కదలిక, తుఫాన్ వస్తున్న వేగం, వీస్తున్న గాలుల వేగంతోపాటు ఏ ప్రాంతంలో అధిక ప్రభావం చూపిస్తోందో కూడా వివరిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే నేరుగా మీరు చూడ వచ్చు… https://esriindia.maps.arcgis.com/apps/webappviewer/index.html?id=845bd03d857b43789d712dee96f056ce

యాస్ తుఫాను ఎలా ట్రాక్ చేయాలి ఎస్రి ఇండియా మ్యాప్‌తో ప్రత్యక్షంగా

యూజర్లు సైక్లోన్ యాస్‌ను ఎస్రి ఇండియా జీఐఎస్ మ్యాప్‌తో బ్రౌజర్‌ను ఉపయోగించి తెలుసు కోవచ్చు. దీని ద్వారా ప్రత్యేకమైన సైక్లోన్ యాస్ లైవ్ పాత్ పేజీకి వెళ్లడం ద్వారా ట్రాక్ చేయవచ్చు.

వినియోగదారులందరూ తుఫానును ట్రాక్ చేయాలి అనుకుంటే…  ఇంటర్నెట్ కనెక్షన్. పేజీ డెస్క్‌టాప్ బ్రౌజర్‌లతో పాటు ఫోన్‌లలో సరిగ్గా అమలు చేయడానికి ఆప్టిమైజ్ చేయబడింది.

మ్యాప్‌లోకి జూమ్ చేయడం ద్వారా వినియోగదారులు ప్రభావిత ప్రాంతాలపై సంబంధిత సమాచారాన్ని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందులో ప్రభావితం కానున్న ప్రదేశాలు, వాతావరణం మరియు విండ్ స్టేషన్ డేటా ఉంటుంది. అంతే కాదు కలర్ ఇమేజ్‌లను సైతం చూడటానికి ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి: Cyclone Yaas: తీరానికి చేరువైన తుఫాన్ … నేడు ఒడిశాలోని భద్రక్‌ వద్ద విరుచుకుపడనున్న‘యాస్‌’

  Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌

Etela New Profile Pick: ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ..