గ్రహణానికి ముందు మెరిసిపోయిన చంద్రుడు.. ఎలా ఉన్నాడో మీరే చూడండి…
Supermoon Rises Over New Zealand: సూపర్ బ్లడ్ మూన్ ఏర్పడటానికి ముందు న్యూజిలాండ్‌లో నిండు జాబిల్లి కనువిందు చేసింది. గ్రహణం తర్వాత అరుణ వర్ణంతో చంద్రుడు మెరిసిపోనున్నాడు.
సూపర్ బ్లడ్ మూన్‌కు ముందు న్యూజిలాండ్‌లో జాబిల్లి ప్రకాశవంతంగా మెరిసిపోయింది. గ్రహణం తర్వాత ఎరుపు, నారింజ రంగుల్లో చంద్రుడు వెలిగిపోనున్నాడు. సూపర్ బ్లడ్ మూన్ ఏర్పడటానికి ముందు న్యూజిలాండ్‌లో నిండు చందమామ కనువిందు చేశాడు. గ్రహణం తర్వాత అరుణ వర్ణంతో చంద్రుడు మెరిసిపోనున్నాడు. 15 నిమిషాల పాటు సూపర్ బ్లడ్ మూన్ కనిపించనుంది. ఈ అపురూపమైన దృశ్యాన్ని చిత్రీకరించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు చంద్ర గ్రహణం మొదలైంది. సాయంత్రం 6.22 గంటల వరకు ఇది కొనసాగుతుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు, నారింజ రంగుల్లో కనిపించనున్నాడు. సూర్యుడి ప్రకాశం వల్ల ఈ రంగులు ఏర్పడనున్నాయి. భారత్‌లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో చూసే అవకాశం ఉంది.
న్యూజిలాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇతర పసిఫిక్, తూర్పు ఆసియా దేశాలలో సూపర్ బ్లడ్ మూన్‌ను చూసే అవకాశం ఉంది. హవాయీ దీవులు, ఉత్తర అమెరికాల్లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున ఇది కనిపించనుంది. అమెరికా తూర్పు తీర ప్రాంతాలు సహా ఐరోపా, ఆఫ్రికా పశ్చిమాసియా దేశాలు ఈ అద్భుతాన్ని చూసే అవకాశం లేదు.
ఇవి కూడా చదవండి : కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి…