AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి…

కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశంలో 577 మంది పిల్లలు తమ తలిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

కోవిద్ పాండమిక్ కారణంగా  ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి...
Smriti Irani
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 26, 2021 | 12:05 PM

Share

కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశంలో 577 మంది పిల్లలు తమ తలిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి తమకు ఈమేరకు సమాచారం అందిందన్నారు. తమ పేరెంట్స్ ను పోగొట్టుకున్న ప్రతి చిన్నారిని ప్రభుత్వం ఆదుకుంటుందని, వారు అనాథలు కాబోరని ఆమె అన్నారు. ప్రతి రాష్ట్రంలో జిల్లా అధికారులు వారి బాగోగులు చూస్తుంటారని, అవసరమైతే అలాంటి బాలలకు నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ లోని ఓ బృందం కౌన్సెలింగ్ ఇఛ్చి వారి భవిష్యత్తుకు తోడ్పడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ పిల్లల సంక్షేమానికి నిధుల కొరత లేదని ఈ బృందం కూడా తెలిపింది. అనాథలైన పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని యాక్టివిస్టులు మహిళా, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఇవ్వడంలేదని యూనిసెఫ్ కూడా విచారం వ్యక్తం చేసింది. ఉదాహరణకు ఒక్క మధ్యప్రదేశ్ లోనే 250 మంది పిల్లలు తమ పేరెంట్స్ ని కోల్పోయి అనాథలు కాగా-మరో 1200 మంది బాలలు తమ తల్లినో, తండ్రినో కోల్పోయినవారు ఉన్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమంత్రి బాల్ కళ్యాణ్ యోజన కింద ఇలాంటి వారిని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు.

వీరికి 21 ఏళ్ళు వచ్చేవరకు ప్రతి నెలా 5 వేల రూపాయలను ఆర్ధిక సాయంగా అందజేస్తారు. ఇక ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా అనాథ పిల్లల సంక్షేమానికి ఇలాంటి పథకాలనే ప్రకటించాయి. అయితే ఇంకా మరిన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవలసి ఉంది.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ…. ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఈ అనాథ చిన్నారుల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: తన ఓనర్ కార్ పార్కింగ్ చేసిన కుక్క..చూస్తే పక్కా షాక్ అవుతారు..! ( వీడియో )

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ వివాహ వేడుకలు.. వివాహం జరుగుతుండగా వధూవరులు ఆటలు… ( వీడియో )