Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SAVELAKSHYADWEEP: లక్ష్యద్వీప్‌లో వేర్పాటు చిచ్చు.. నియంత్రిస్తున్నారంటూ ఆందోళనపర్వం

భారత దేశానికి సుదూరంగా సముద్రంలో వుండి మన దేశంలో అంతర్భాగమైన లక్ష్యద్వీప్ దీవులిపుడు అసహనం, అసంతృప్తితో నిండిపోతున్నాయి. ఫలితంగా సేవ్ లక్ష్యద్వీప్ క్యాంపెయిన్ క్రమంగా ఊపందుకుంటోంది.

SAVELAKSHYADWEEP: లక్ష్యద్వీప్‌లో వేర్పాటు చిచ్చు.. నియంత్రిస్తున్నారంటూ ఆందోళనపర్వం
Save Lakshadweep
Follow us
Rajesh Sharma

|

Updated on: May 26, 2021 | 2:09 PM

SAVELAKSHYADWEEP CAMPAIGN RAISING AGAIN: భారత దేశానికి సుదూరంగా సముద్రంలో వుండి మన దేశంలో అంతర్భాగమైన లక్ష్యద్వీప్ దీవులిపుడు అసహనం, అసంతృప్తితో నిండిపోతున్నాయి. ఫలితంగా సేవ్ లక్ష్యద్వీప్ క్యాంపెయిన్ క్రమంగా ఊపందుకుంటోంది. అరేబియా సముద్రం (ARABIAN SEA)లో వుండే ఈ దీవుల పరిపాలనలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు స్థానికులకు ఇబ్బందికరంగా మారాయి. దాంతో కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ (ADMINISTRATOR OF UNION TERRITORY) తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరకంగా స్థానికులు క్యాంపెయిన్ ప్రారంభించారు. సేవ్ లక్ష్యద్వీప్ (#SAVELAKSHADWEEP) పేరిట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

భారత దేశం (INDIA)లో అంతర్భాగంగా కేంద్ర పాలిత ప్రాంతంగా వున్న లక్ష్యద్వీప్‌కు కేంద్ర ప్రభుత్వ దూతగా రిటైర్డ్ ఉన్నతాధికారులను నియమిస్తుంటారు. కేంద్ర ఇంటలిజెన్స్‌ (CENTRAL INTELLIGENCE)లో పని చేసి రిటైర్ అయిన దినేశ్వర్ శర్మ గత సంవత్సరం వరకు అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగారు. ఆయన 2020 డిసెంబర్‌లో మరణించడంతో మరో కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీ (DADRA NAGAR HAWELI) అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌ (PRAFUL PATEL)కు బాధ్యతలు అప్పగించారు. ఈయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PRIME MINISTER NARENDRA MODI)కి సన్నిహితులుగా పేరుంది. గతంలో ఆయన మోదీ ముఖ్యమంత్రిత్వంలో గుజరాత్ మంత్రి (GUJARAT MINISTER)గాను వ్యవహరించారు. ప్రధానితో వున్న సాన్నిహిత్యాన్ని అడ్డుగా పెట్టుకుని లక్ష్యద్వీప్‌కు సంబంధించి ప్రఫుల్ పటేల్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి కాస్తా స్థానికులకు నచ్చడం లేదు. దాంతో వారు సేవ్ లక్ష్యద్వీప్ పేరిట వేర్పాటు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా (SOCIAL MEDIA)లో తెగ ప్రచారం చేస్తున్నారు.

ప్రఫుల్ పటేల్ అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాలపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యద్వీప్‌లో విద్య (EDUCATION), వైద్యం (HEALTH), వ్యవసాయం (AGRICULTURE), మత్స్య (FISHERIES), పశుపోషణ (ANIMAL HUSBANDARY) శాఖలు గతంలో జిల్లా పంచాయితీల పరిధిలో వుండేవి. వాటిని నేరుగా తాను పర్యవేక్షించేలా ఉత్తర్వులు జారీ చేశారు అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్. గతంలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టాలేవీ వుండేవి కావు.. నేరాలు పెరుగుతున్న సంకేతాలు కనిపించడంతో గూండా చట్టాన్ని (GOONDA ACT) అమల్లోకి తెచ్చారు. గతంలో లక్ష్యద్వీప్‌లో లిక్కర్ బ్యాన్ (LIQUOR PROHIBITION) వుండేది. అయితే.. పర్యాటక రంగం (TOURISM SECTOR) విస్తృతికి మద్య నిషేధం అడ్డుగా వుందని భావించిన ప్రఫుల్ పటేల్.. మద్యం అమ్మకాలను అనుమతించారు. అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించారు. లక్ష్యద్వీప్‌కు కేరళలోని బైపూర్ పోర్టు (BIPOOR PORT) నుంచి సరుకులు రవాణా అయ్యేవి.. వాటిని ఇకపై కర్నాటక (KARNATAKA)లోని మంగుళూరు పోర్టు (MANGALORE PORT)నుంచి తెచ్చుకోవాలని అడ్మినిస్ట్రేటర్ ఆదేశాలు జారీ చేశారు. దానికితోడు లక్ష్యద్వీప్‌లో జంతువధను నిషేధించారు. బీఫ్ అమ్మకాలపై నిషేధం పెట్టారు. ఈ నిర్ణయాలు స్థానికులకు నచ్చకపోవడంతో తమ సంస్కృతిపై అడ్మినిస్ట్రేటర్ దాడి చేస్తున్నారంటూ సేవ్ లక్ష్యద్వీప్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే.. ఈ క్యాంపెయిన్ కాస్తా ప్రస్తుతం వేర్పాటు ఉద్యమం దిశగా దారి మళ్ళుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు నుంచి బంగారు లాకెట్ల పంపిణీ
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు నుంచి బంగారు లాకెట్ల పంపిణీ
చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం.. నిందితుడు ఎన్‌కౌంటర్..
చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం.. నిందితుడు ఎన్‌కౌంటర్..
Video: సిగ్గుందా అసలు.. సెంచరీ చేసినోడికి ఇదేం చెత్త అవార్డ్..
Video: సిగ్గుందా అసలు.. సెంచరీ చేసినోడికి ఇదేం చెత్త అవార్డ్..
IPL 2025: ఐపీఎల్ హిస్టరీలో చెత్త ఓపెనర్‌.. ఇకపై కొనడం కష్టమే?
IPL 2025: ఐపీఎల్ హిస్టరీలో చెత్త ఓపెనర్‌.. ఇకపై కొనడం కష్టమే?
శివుడికి ఈ పరిహారాలు చేయండి.. ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం ..
శివుడికి ఈ పరిహారాలు చేయండి.. ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం ..
ఆ రాశుల వారికి శుభ యోగాలు పట్టే అవకాశం.. 12 రాశుల వారికి దినఫలాలు
ఆ రాశుల వారికి శుభ యోగాలు పట్టే అవకాశం.. 12 రాశుల వారికి దినఫలాలు
తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
యువతకు భలే ఛాన్స్.. SBI యూత్‌ ఫెలోషిప్‌ 2025కు దరఖాస్తుల ఆహ్వానం!
యువతకు భలే ఛాన్స్.. SBI యూత్‌ ఫెలోషిప్‌ 2025కు దరఖాస్తుల ఆహ్వానం!
వేసవిలో తప్పక తినాల్సిన ఆరోగ్యకరమైన పండ్లు ఇవే..!
వేసవిలో తప్పక తినాల్సిన ఆరోగ్యకరమైన పండ్లు ఇవే..!
W,W,W.. 3 బంతుల్లో మారిన ముంబై ఫేట్..
W,W,W.. 3 బంతుల్లో మారిన ముంబై ఫేట్..