Lottery: కాలదన్నుకున్నా.. ఆ మహిళకే వరించిన 7 కోట్ల లాటరీ.. అసలేం జరిగిందంటే..?

indian origin family: ఎంతైనా మన కష్టంతోపాటు.. కొంతైనా అదృష్టం ఉండాలంటారు.. ఎంత కష్టపడినా.. అనుకున్నది దక్కదు.. చివరికీ నిరాశే ఎదువుతుంటుంది. అయితే.. కొన్నిసార్లు

Lottery: కాలదన్నుకున్నా.. ఆ మహిళకే వరించిన 7 కోట్ల లాటరీ.. అసలేం జరిగిందంటే..?
Massachusetts Lottery
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 26, 2021 | 11:44 AM

indian origin family: ఎంతైనా మన కష్టంతోపాటు.. కొంతైనా అదృష్టం ఉండాలంటారు.. ఎంత కష్టపడినా.. అనుకున్నది దక్కదు.. చివరికీ నిరాశే ఎదువుతుంటుంది. అయితే.. కొన్నిసార్లు మనం కాలదన్నుకున్నా.. అదృష్టమనేది దానంతట అదే వరిస్తుంది. ఇలాంటిదే అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరిగింది. ఓ మహిళ లాటరీ టికెట్‌ కొని సరిగ్గా చూసుకోకుండానే విసిరేసింది. దాని విలువ రూ.7.3 కోట్లు అయినా ఆమెకు తెలియదు. తనకు లాటరీ టికెట్ వస్తుందా అంటూ.. టికెట్‌ నంబర్‌ను సరిగా చూసుకోకుండానే చెత్తకుప్పలో వేసింది లీ రోజ్‌అనే మహిళ. అయినా ఆ డబ్బు చివరికి ఆమెకే దక్కింది. అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన అభీ అనే వ్యక్తి లక్కీ స్టాప్‌ అనే లాటరీ టికెట్ల షాప్‌ను నిర్వహిస్తున్నారు. అయితే.. లీ రోజ్‌ ఆ షాప్‌నకు రెగ్యులర్‌గా వెళ్తుంటుంది. మార్చిలో షాప్‌కు వెళ్లిన ఆమె.. ఒక మిలియన్ లాటరీకి సంబంధించిన టికెట్‌ కొని స్క్రాచ్ చేసింది. లంచ్‌కు వెళ్లాలనే తొందరలో దాన్ని సరిగా చూసుకోకుండానే.. లాటరీ రాలేదన్న నిరాశతో టికెట్‌ను షాప్‌లోని ఓ మూలన చెత్తకుప్ప దగ్గర పడేసి వెళ్లిపోయింది. 10రోజుల పాటు అక్కడే మిగతా టికెట్ల కుప్పలో ఉన్న ఆ ‘లక్కీ టికెట్‌’ను అభి చూసి ఆశ్చర్యపోయారు.

ఈ టికెట్‌ విషయంలో ఏం చేయాలని అభీ కుటుంబం రెండు రోజులపాటు దీర్ఘాలోచనలో పడింది. అభీ ఆ లాటరీ డబ్బుతో తన కోసం ఓ కారు కొనుక్కోవాలనుకున్నారు. చివరికి కుటుంబసభ్యులంతా.. ఈ లాటరీ టికెట్ సొమ్ము కస్టమర్‌కే చెందాలనే నిర్ణయానికొచ్చారు. అనంతరం లీ రోజ్‌కు అభీ ఫోన్‌ చేశారు. ఈ విషయాన్ని చెప్పినా.. లీ రోజ్ నమ్మలేదు. ఆ తర్వాత అభీ షాప్‌కు రావాలని చెప్పారు. ఆ తర్వాత షాప్‌కు వచ్చి టికెట్‌ చూసుకొని లీ రోజ్ ఎగిరి గంతేశారు. ఆనందంతో షాప్‌ నిర్వాహకులను పొగుడుతూ.. కౌగిలించుకున్నారు. వారి నిజాయితీని అభినందిస్తూ అందరూ తెగ ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్య్వూ కోసం పలు మీడియా సంస్థలు సైతం అభీ షాప్‌కు చేరుకుంటున్నాయి.

Alson Read:

Cyclone Yaas: అల్లకల్లోలం సృష్టిస్తున్న యాస్ తుఫాన్.. నివాస ప్రాంతాల్లోకి సముద్రం నీరు.. వీడియో..

Cyclone Yaas: అల్లకల్లోలం సృష్టిస్తున్న యాస్ తుఫాన్.. నివాస ప్రాంతాల్లోకి సముద్రం నీరు.. వీడియో..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!