Viral Video: సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!

సర్కస్‌లో జంతువులు చేసే.. ఫన్నీ స్టంట్స్‌ భలే ముచ్చటేస్తుంటాయి. ఇక సింహాలు, చిరుత పులులు చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌ గురించి...

Viral Video: సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!
Follow us
Ravi Kiran

|

Updated on: May 26, 2021 | 12:53 PM

సర్కస్‌లో జంతువులు చేసే.. ఫన్నీ స్టంట్స్‌ భలే ముచ్చటేస్తుంటాయి. ఇక సింహాలు, చిరుత పులులు చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడవిలో జంతువులను వేటాడటం మాత్రమే తెలిసిన సింహాలు, సైకిల్‌ తొక్కడం, డ్యాన్స్‌ చేయడం లాంటివి చూసి జనాలు ఆశ్చర్యపోతారు. కానీ అదే సింహాలు సర్కస్ బోనులో నుంచి మనపైకి వస్తే .? ఇంకేమైనా ఉందా..? భయంతో అక్కడే ప్రాణాలు వదులుతాం. అయితే తాజాగా సర్కస్‌లో ఓ ఆడ సింహం సర్కస్‌ ట్రైనర్‌పై దాడి చేసింది.

రష్యాలోని ఓ సర్కస్‌లో రెండు సింహాలతో పెద్ద బోనులోకి సర్కస్‌ ట్రైనర్‌ మాక్సిం ప్రవేశించాడు. ఇక సింహాలను చూసిన జనం గట్టిగా కేకలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా చిర్రెత్తిపోయిన ఆ సింహాలు.. ట్రైనర్‌ మాక్సిం ఓర్లోస్‌పైకి దూకాయి. ఇక ఆ ట్రైనర్‌ తన చేతిలోని కర్రలతో వాటిని భయపెట్టగా.. అవి దూరంగా వెళ్లాయి.

కాసేపటికే మళ్లీ ఆడ సింహాం మాక్సింపై దాడి చేసింది. కాళ్లు, చేతులు కొరుకుతూ చుక్కలు చూపించాయి. ఇక ఎలాగోలా దాని బారి నుంచి తప్పించుకున్న మాక్సిం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:

చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!

మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!