- Telugu News Photo Gallery Sports photos Virat kohli had relationship with model actress izabelle leiti 2012 here is the detail
Virat Kohli: పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!
2018వ సంవత్సరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందు కోహ్లీపై పలు డేటింగ్ రూమర్స్ వచ్చాయి..
Ravi Kiran | Edited By: Team Veegam
Updated on: May 24, 2021 | 10:37 AM

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందు అతడిపై పలు డేటింగ్ రూమర్స్ వెల్లువెత్తాయి. 2012-2014 మధ్య, కోహ్లీ, బ్రెజిలియన్ మోడల్‌తో డేటింగ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో పలు రూమర్స్ వచ్చాయి.

ఆ మోడల్ పేరు ఇజాబెలి. 2012-2014 మధ్య ఇజాబెలి, కోహ్లీ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం 2013లో బయటకు వచ్చింది. ఆ సమయంలో అనేక సార్లు కోహ్లీ, ఇజాబెలి కలిసి మీడియా కంటికి కనిపించారు.

విరాట్ కోహ్లీ, ఇజాబెలి లెట్టి 2014లో విడిపోయారు. దీనిపై కోహ్లీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఇజాబెలి మాత్రం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ''అవును మేము రెండు సంవత్సరాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. మేము పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఆ తర్వాత ఇజాబెలి లెట్టి, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

బ్రెజిల్‌లోని రోసారియో నగరానికి చెందిన ఇజాబెలి... 2012లో తలాష్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కరీనా కపూర్, రాణి ముఖర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఆ తర్వాత సిక్స్‌టీన్, ఓల్డ్ జీన్స్ వంటి హిందీ చిత్రాల్లో నటించింది. ఇవే కాకుండా నరేంద్ర, మిస్టర్ మజ్ను, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి తెలుగు చిత్రాలలో కూడా నటించింది.





























