- Telugu News Photo Gallery Sports photos Whats the connection of number 183 with indian cricket team ms dhoni v kohli s ganguly have
టీమిండియా క్రికెట్‌లో 183 నెంబర్‌కు ఓ కిక్కుంది..! ఈ మార్కును దాటిన ఆటగాడు ఏమయ్యోడో తెలుసా…
భారత క్రికెట్‌లో '183'కు ఓ ప్రత్యేకత ఉంది. అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయిన ఎంఎస్ ధోనీ, గంగూలీ, కోహ్లీల అత్యధిక స్కోరు ఇదే. అయితే దీని వెనక ఓ ఆసక్తికర సంగతి ఉంది. ఈ ముగ్గురు క్రికెటర్లు.. ఆ నంబర్‌ను అందుకున్న తర్వాతే టీమిండియా జట్టుకు కెప్టెన్లుగా మారారు. ఆ తర్వాత ఎన్నో చిరస్మరణీయ ఘనతల్ని సాధించారు.
Updated on: May 24, 2021 | 11:33 PM

1999 ప్రపంచకప్‌లో సౌరభ్ గంగూలీ శ్రీలంకపై 183 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏడాదే భారత జట్టులో ఫిక్సింగ్ కుంభకోణం జరిగిన నేపథ్యంలో కెప్టెన్‌గా అవతరించాడు.

2005లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడోస్థానంలో బరిలోకి దిగి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20 ప్రపంచకప్(2007) సమయంలో సీనియర్ల గైర్హాజరీతో కెప్టెన్సీ దక్కించుకున్నాడు.

2012 ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 183 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆ తర్వాత ఏడాదే, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సారథి హోదాను అందుకున్నాడు. 2017లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా మారాడు.

2010లో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తొలిసారి ఈ మార్క్ అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. అక్కడి నుంచి సరిగ్గా 18 నెలల తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ దీనిని బ్రేక్ చేశాడు. వెస్టిండీస్‌పై 219 పరుగులు చేశాడు.





























