Viral Video: చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!

Python And leopard Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి మిలియన్ల కొద్దీ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి...

Viral Video: చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!
Leopard
Follow us
Ravi Kiran

|

Updated on: May 24, 2021 | 3:05 PM

Python And leopard Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి మిలియన్ల కొద్దీ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవే ఇంటర్నెట్‌లో ఎక్కువ వీక్షించే కంటెంట్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. వాటిల్లో కొన్ని వీడియోలు అందంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరుత ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు. దాని వేగం, చాతుర్యం వేటాడేటప్పుడు క్షుణ్ణంగా కనిపిస్తాయి. అవి అప్పుడప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఎన్నో జంతువులను చిరుత వేటాడటం మీరు చూసి ఉంటారు.! మరి ఎప్పుడైనా ఓ పైథాన్‌ను చిరుత వేటాడటం చూశారా.? దాన్ని చూసి మీరు షాక్ కావడం ఖాయం. కేవలం 45 సెకండ్స్ పాటు సాగిన ఈ పోరాటంలో ఎవరు పైచేయి సాధించారో చూడండి.

వీడియోలో, ఒక పైథాన్ చెట్టు పొదలు గుండా వెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. అక్కడే సేద తీరుతున్న చిరుత దానిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. పైథాన్ కూడా తక్కువేమీ కాదుగా.. బుసలు కొడుతూ ఎదురు దాడికి దిగుతుంది. దాని కాటు నుంచి రెండుసార్లు చిరుత తప్పించుకోగా.. మూడోసారి ఏకంగా చిరుతను చుట్టేయడానికి పైథాన్ ప్రయత్నిస్తుంది. ఏది ఏమైనా హోరాహోరీగా సాగిన ఈ పోరాటంలో రెండు జంతువులూ కూడా కొద్దిసేపటి తర్వాత ఎవరు దారి.. వారు చూసుకున్నారు. ఈ వీడియో పాతదే అయినా మరోసారి ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ తన యూట్యూబ్‌లో పెట్టింది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?