Foods In Refrigerator: వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!

Foods Don't Store In Refrigerator: ఎండాకాలం వస్తే చాలు.. అధిక తీవ్రత కారణంగా కూరగాయలు, ఆహార పదార్ధాలు త్వరగా పాడైపోతుంటాయి...

Foods In Refrigerator: వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!
Food
Follow us
Ravi Kiran

|

Updated on: May 25, 2021 | 10:03 PM

Foods Don’t Store In Refrigerator: ఎండాకాలం వస్తే చాలు.. అధిక తీవ్రత కారణంగా కూరగాయలు, ఆహార పదార్ధాలు త్వరగా పాడైపోతుంటాయి. ఇందువల్ల వీలైనంత వరకు కూరగాయలను, తినే ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటాం. ఒక్క ఇవే కాదు.. అప్పుడప్పుడూ మనం వండిన వంటలను సైతం పాడైపోకుండా ఫ్రిజ్‌లో పెడుతుంటాం. ఇలా అన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టొచ్చా.? లేదా.? అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.! అసలు ఫ్రిజ్‌లో ఏయే పదార్ధాలను ఉంచాలి.. ఎలాంటి వాటిని ఉంచకూడదు.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • బంగాళదుంప- బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల.. వాటిపై తొక్కలో ఉండే తేమ ఆవిరై గట్టి పడిపోతాయి. అందువల్ల వాటిని ముక్కలుగా తరిగేటప్పుడు ఇబ్బంది ఎదురవుతుంది. అంతేకాకుండా వాటి లోపల ఉండే పిండి పదార్ధం కూడా తేమను పూర్తిగా కోల్పోతుంది.
  • టమాటా- టమాటాలను అసలు ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే వాటి మీద ఉండే పలచటి పొర ముడతలు పడిపోతాయి. వాటిల్లో ఉండే విటమిన్ సీ, పొటాషియం తగ్గిపోతుంది.
  • ఉల్లిపాయలు- టమాటాల మాదిరిగానే ఉల్లిపాయలను, వెల్లుల్లిని కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్ చల్లదనానికి ఉల్లిపాయలు ఐస్‌లా మారుతాయి. వాటి పొరలు కూడా బాగా దగ్గరకు అవుతాయి. ఇందువల్ల వాటిని వాడే సమయంలో పొరలుగా విడదీయడం బాగా కష్టమవుతుంది.
  • పుచ్చకాయ- పుచ్చకాయలను గానీ.. కోసిన ముక్కలను గానీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లన్నీ తగ్గిపోతాయి. దీనితో తియ్యగా ఉండాల్సిన పుచ్చకాయ చప్పగా తయారవుతుంది.

వీటితో పాటు తేనే, బ్రెడ్, వెన్న, అరటిపళ్లు, గుమ్మడికాయ, సిట్రస్ ఫ్రూట్స్, మునగాకడ, చిల్లీ హాట్ సాస్ వంటి ఆహారపదార్ధాలను కూడా ఫ్రిజ్‌లో ఉంచరాదు. కాగా, క్రీమ్ బిస్కెట్లు, చాకోలెట్స్, కంటి, చెవి డ్రాప్స్, రకరకాల పండ్లు, ఆకు కూరలు, కొబ్బరి చిప్పలు(ఎండినవి కావు), పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు లాంటివి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?