Protein Shakes : టీ, కాఫీలు మానేయండి.. ఈ ప్రొటీన్ షేక్‌లు అలవాటు చేసుకోండి.. ఇమ్యూనిటీని పెంచుకోండి..
Protein Shakes : కరోనా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించాలి. మంచి ఆహారం తీసుకుంటే
Protein Shakes : కరోనా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించాలి. మంచి ఆహారం తీసుకుంటే వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఆహారంలో ఈ ప్రోటీన్‌ను చేర్చాలి.
1.ప్రోటీన్ షేక్ మీకు ఉదయం కాఫీ లేదా టీ తాగడం అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఇవి మీ శరీరానికి హానికరం. మీరు టీ-కాఫీకి బదులుగా ప్రోటీన్ షేక్ తాగవచ్చు. అరటి, ఆపిల్, బాదం, జీడిపప్పును పాలతో కలిపి షేక్‌గా చేసుకొని తాగవచ్చు. దీన్ని తాగడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి దూరం చేస్తాయి.
2. అరటి షేక్ అరటిలో 100 కేలరీల శక్తి ఉంటుంది. ఇది రోజంతా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అదనంగా ఇందులో ఉన్న ఎలక్ట్రోలైట్స్, ఖనిజాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అరటి మీ ఆరోగ్యానికి ఉత్తమమైన పండ్లలో ఒకటి. అరటిలో యాంటీఆక్సిడెంట్లు, నీరు, ఫైబర్ అధికంగా ఉంటాయి.
3. యాపిల్ షేక్ యాపిల్ తినడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. రోజుకో యాపిల్ తినే వ్యక్తులు ఎప్పుడూ డాక్టర్ వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. ఇందులో చాలా విటమిన్లు ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి సహాయపడతాయి. యాపిల్స్‌లో పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి.
4. బాదం షేక్ బాదం బాదం షేక్ ఆరోగ్య పోషకాలను కలిగి ఉంటుంది. కనుక మీరు వాటిని క్రమం తప్పకుండా తినాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఈ చిన్న ఎండిన పండ్లలో అద్భుత ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బాదంపప్పులో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పులో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అదనంగా కేలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. ప్రస్తుత కరోనా యుగంలో మనం బాదం షేక్‌ని డైట్‌లో కచ్చితంగా చేర్చాలి.