Cyclone Yaas: అల్లకల్లోలం సృష్టిస్తున్న యాస్ తుఫాన్.. నివాస ప్రాంతాల్లోకి సముద్రం నీరు.. వీడియో..

Cyclone Yaas updates: తీర ప్రాంతాల్లో రాకాసి తుఫాన్ ‘యాస్’అల్లకల్లోలం సృష్టిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా

Cyclone Yaas: అల్లకల్లోలం సృష్టిస్తున్న యాస్ తుఫాన్.. నివాస ప్రాంతాల్లోకి సముద్రం నీరు.. వీడియో..
Cyclone Yaas
Follow us

|

Updated on: May 26, 2021 | 10:19 AM

Cyclone Yaas updates: తీర ప్రాంతాల్లో రాకాసి తుఫాన్ ‘యాస్’అల్లకల్లోలం సృష్టిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం అతి తీవ్ర తుఫాన్‌గా మారి మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా తీరాన్ని ఢీకొడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో సముద్రం నీరు నివాసప్రాంతాల్లోకి వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ లోని న్యూ దిఘా బీచ్ వెంబడి సముద్రం నుంచి నీరు నివాస ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి. రాకాసి అలలు పెద్ద ఎత్తున ఉగ్రరూపంతో దూసుకువస్తున్నాయి. అంతేకాకుండా ఒడిషా ప్రాంతాల్లో ఈదురు గాలులతో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వీడియో..

అయితే.. యాస్ తుఫాను బాలసోర్ (ఒడిశా) కి దక్షిణ-ఆగ్నేయంలో 50 కి.మీ. ఉదయం 9 గంటలకు తీరానికి సమీపించిందని ఐఎండి వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతోపాటు ఒడిషా, బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాల్లో అలర్ట్‌ను జారీ చేశారు.

Also Read:

Telangana police: లాక్‌డౌన్‌లో రోడ్డెక్కితే.. కోర్టుకెళ్లాల్సిందే..! వాహనదారులకు పోలీసుల హెచ్చరిక..

Corona: కొత్త లక్షణాలతో వ్యాపిస్తున్న కరోనా.. సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!