Viral Video: సేద తీరుతున్న చిరుత.. అంతలో మొసలి ఎటాక్.. షాకింగ్ వీడియో వైరల్.!

సముద్రపు అలెగ్జాండర్‌గా పిలవబడే మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే.. నీటిలో ఉన్నప్పుడు దాని బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన..

Viral Video: సేద తీరుతున్న చిరుత.. అంతలో మొసలి ఎటాక్.. షాకింగ్ వీడియో వైరల్.!
Leopard 1
Follow us
Ravi Kiran

|

Updated on: May 26, 2021 | 8:48 AM

సముద్రపు అలెగ్జాండర్‌గా పిలవబడే మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే.. నీటిలో ఉన్నప్పుడు దాని బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏనుగును సైతం తన నోటితో కట్టిపడేయగల బలశాలి. అలాంటి మొసలి నోటికి చిక్కిన ఓ చిరుత తృటిలో తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుంది. ఈ షాకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

వేసవితాపం తట్టుకోలేక ఓ చిరుత పులి నీటి మడుగు ఒడ్డున సేదతీరుతోంది. కాస్త నీళ్లలోకి ముఖం పెట్టి హాయిగా పడుకుండిపోయింది ఆ చిరుత. అప్పటికే ఆ నీటిలో ఉన్న మొసలి దానిపై మాటువేసింది. గాఢనిద్రలో ఉన్న చిరుతపై ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉన్నట్టుండి వచ్చిన నీటి అలజడితో…చిరుత ఉలిక్కిపడి లేచింది. తనపైకి వస్తున్న ఆపదను గుర్తించి వాయువేగంతో ఒక్కజంప్‌ చేసి మొసలి నోటికి చిక్కకుండా తప్పించుకు పారిపోయింది. ఈ వీడియో చిరుత వేగానికి నిదర్శనంగా తెలుస్తోంది. కాగా, దీనిని చూసిన నెటిజన్లు..షాక్‌ అవుతున్నారు. చిరుత భలే తప్పించుకుందంటూ విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. వీడియో షేర్‌ చేసిన కొన్ని క్షణాల్లోనే లక్షల వ్యూస్‌ని సంపాదించుకుంది.

Also Read:

చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!

మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!