Viral News: ఆ ఇంట్లో భారీ చోరీ.. కట్ చేస్తే.. ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్.!
ఆ ఇంట్లో ఓ భారీ చోరీ జరిగింది. సుమారు రూ. 65 లక్షలకుపైగా బంగారం.. వెండిని దొంగలించారు. దీనితో ఆ ఇంటి పెద్ద మనిషి పోలీసులకు కంప్లైంట్..
ఆ ఇంట్లో ఓ భారీ చోరీ జరిగింది. సుమారు రూ. 65 లక్షలకుపైగా బంగారం.. వెండిని దొంగలించారు. దీనితో ఆ ఇంటి పెద్ద మనిషి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఇంతటి భారీ చోరీ జరగడానికి కారణం అతడి భార్యనే కావటంతో కథలో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. ఈ ఉదంతం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన శివ ప్రకాష్, అర్చనలకు 2008లో పెళ్లయింది. వీరికి ముగ్గురు పిల్లలు. పెళ్లి అయిన కొద్ది రోజులకే వీరి మధ్య తగాదాలు రావడం.. అవి కాస్తా పెరిగి పెద్దవి కావడం జరిగింది. ఈ క్రమంలోనే అర్చన తన భర్తకు దూరంగా పిల్లలతో గుంటూరులోని తన తల్లి వద్ద ఉంటోంది. ఈ సమయంలోనే కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తికి దగ్గరై.. అతడితో వివాహేతర సంబంధానికి తెర తీసింది. ఇదిలా ఉంటే నెల రోజుల క్రిందట తన అత్త చనిపోయిన సమాచారం తెలుసుకుని భర్త వద్దకు వెళ్లింది అర్చన.
అప్పుడే ఇంట్లో ఉన్న బంగారం, వెండిని దొంగలించాలని ప్లాన్ రచించింది. దాని కోసం ప్రియుడు సాయం కోరింది. అతడిని ఊరికి రప్పించింది. భర్త నిద్రపోతున్నప్పుడు అతడి దగ్గర ఉన్న లాకర్ తాళం తీసుకుని మొత్తం బంగారం, వెండి అంతటిని దోచేసింది. ఆ తర్వాత తనకు ఏం తెలియదన్నట్లుగా అమాయకంగా ఉండిపోయింది. తన ఇంట్లో భారీ చోరీ జరగడంపై శివప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలో దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్‌లో విచారించగా.. ఈ దోపిడీకి స్కెచ్ వేసింది భార్య అర్చనే అన్న నిజం బయటకు వచ్చింది.
Also Read:
చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!
మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!
పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!
వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!