Telangana: ఆ ఉద్యోగులకు జీతాల్లో 15% కోత.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!
గ్రూప్-2 నిమాయమక పత్రాల పంపిణీలో ఉద్యోగులకు వ్యక్తిత్వ వికాస క్లాస్ చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. నిస్సహాయుల కోసమే అధికారం, వాళ్లకు సాయం చేయడమే ఉద్యోగమన్న రేవంత్‌రెడ్డి... ఇకపై కన్నవారిని పట్టించుకోకపోతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా ఓ చట్టాన్నే తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పిల్లలను కని , పెంచి..ప్రయోజకులుగా తీర్చిదిద్దన తల్లిదండ్రులకు.. వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టడానికి చాలా మందికి చేతులు రావడం లేదు. వయసు పైబడిన వారిని భారంగా భావించే ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు రెడీ అవుతున్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దని గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఉద్యోగుల జీతంలో 15 శాతం కట్ చేసి ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తామన్నారు. త్వరలో దీనికి సంబంధించిన చట్టం కూడా తీసుకొస్తామన్నారు రేవంత్‌రెడ్డి.
ఈ అంశంపై తగిన కార్యాచరణ రూపొందించి… సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. అవసరమైతే ఈ చట్టాన్ని వారితోనే రాయించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనను అమలు చేసే దిశగా అధికారులు నివేదిక రూపంలో సమర్పించే అవకాశం ఉంది. అధికారులు ఇచ్చే నివేదికను బట్టి సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోనున్నారు. తల్లిదండ్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వినూత్న ఆలోచన సమాజంలో సానుకూల మార్పును తీసుకొస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
Also Read: ఘట్‌కేసర్‌లో అనుమానాస్పదంగా 17 ఏళ్ల బాలుడు.. ఆపి తనిఖీ చేయగా..




