Telangana: క్రాకర్స్ షాప్‌లో మంటలు.. పండగకు ముందే తగబడిన దుకాణం.. ఎక్కడంటే
దివాళి పండగకు ముందురోజు సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పండగ కోసం ఏర్పాటు చేసిన టపాసుల దుకాణంలో మంటలు చెలరేగి దుకాణం మొత్తం కాలిపోయింది. టపాసుల ప్యాకింగ్ కవర్లను వ్యర్థాల్లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వ పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

దివాళి పండగకు ముందురోజు సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం, సంగుపేట గ్రామ శివారులో పండగ కోసం ఏర్పాటు చేసిన టాపాసుల దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి టాపాసులు మొత్తం కాలిపోయాయి. టపాసుల ప్యాకింగ్ పేపర్ల వ్యర్థాల్లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వ పడటంతో ఈ మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. దుకాణం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగలు వ్యాపించడంతో భయాందోళనకు గురైన దుకాణ యజమానులు వెంటనే ఫైర్ సిబ్బందకి సమాచారం ఇచ్చారు.
సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పండగ కోసమని తెచ్చిన టపాసులు అన్ని కాలిపోవడంతో బాధిత వ్యాపారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




