AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.. ఇంటి దొంగలను వదిలబోనుః రేవంత్‌రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లోని ఇంటి దొంగలను వదిలబోనని హెచ్చరించారు.

Revanth Reddy: కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.. ఇంటి దొంగలను వదిలబోనుః రేవంత్‌రెడ్డి
నిర్మల్ జిల్లాలో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Balaraju Goud
|

Updated on: Jul 12, 2021 | 9:42 PM

Share

PCC President Revanth Reddy Sensational Comments: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లోని ఇంటి దొంగలను వదిలబోనని హెచ్చరించారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉంటే నెలాఖరులోగా వెళ్లి పోవచ్చంటూ డెడ్‌లైన్ విధించారు. కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.

అలాగే, ఉద్యమాలతో త్వరలోనే టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడుతామన్నారు. తమ పార్టీ కార్యకర్తలను అధికారులు ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. ఇబ్బంది పెట్టే వారి డైరీ రాస్తున్నామని, వేధించిన అధికారుల మోకాలి చిప్పలు పగల గొట్టిస్తామని ఘాటుగా వ్యాఖ్యనించారు రేవంత్ రెడ్డి. అధికారులు చట్ట పరిధిలో పని చేయాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మూల్యం చెల్లిస్తారని వార్నింగ్ ఇచ్చారు. 2023లో గోల్కొండ ఖిల్లాపై కాంగ్రెస్ అధికారిక జెండా ఎగుర ఖాయమన్నారు రేవంత్ రెడ్డి.

Read Also… Kaushik Reddy: రేవంత్‌రెడ్డి వల్ల తెలంగాణలో ఆరు నెలల్లో కాంగ్రెస్ ఖాళీ.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ