Kaushik Reddy: రేవంత్‌రెడ్డి వల్ల తెలంగాణలో ఆరు నెలల్లో కాంగ్రెస్ ఖాళీ.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డి.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో ఖాళీ కావడం ఖాయమన్నారు.

Kaushik Reddy: రేవంత్‌రెడ్డి వల్ల తెలంగాణలో ఆరు నెలల్లో కాంగ్రెస్ ఖాళీ..  కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Kaushik Reddy Hot Comments On Revanth Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 12, 2021 | 9:45 PM

Kaushik Reddy hot comments on Revanth Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డి.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో ఖాళీ కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టబోతున్నాడని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక అధ్యక్షుడుగా వ్యవహరించడం లేదన్న ఆయన.. పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉంటే హుజురాబాద్‌లో కాంగ్రెస్ గెలవదన్నారు. ఈటెల రాజేందర్ కి రేవంత్ రెడ్డి అమ్ముడు పోయాడని ఆరోపించారు. ఈటెల రాజేందర్ కాంగ్రెస్‌లో ఉంటే ఈజీగా గెల్చేవాడని బీజేపీలో చేరి పెద్ద తప్పు చేశారని ధ్వజమెత్తారు.

ఇన్ని రోజులు కాంగ్రెస్ జండా మోసిన వాళ్లు ఎటు పోయారని.. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగంచడమేంటని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ సంపాదించారని ఆరోపించారు. భట్టి ,జీవన్ రెడ్డి, జానారెడ్డి ఇంకా చాలా మంది ఉన్న డబ్బులకు అమ్ముడు పోయి రేవంత్ కి పార్టీ బాధ్యతలు ఇచ్చారని విమర్శించారు.

కరీంనగర్‌లో డిపాజిట్ రాని వ్యక్తిని ఇక్కడ పోటీకి పెట్టేందుకు యత్నిస్తున్నారని అందుకే పార్టీ వీడుతున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు పొన్నం ప్రభాకర్‌కి టికెట్ ఇస్తే డిపాజిట్ దక్కదన్నారు. రేవంత్ రెడ్డి వల్ల ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఖాళీ కావడం ఖాయమన్నారు.

మరోవైపు, వరుసగా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ క్రమాశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై కోవర్ట్‌గా మారి, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నందుకు బహిష్కరణ వేటు వేసినట్లు వారు తెలిపారు. అంతకు ముందే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నేరుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారాయన. ఈనెల 16న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు కౌశిక్‌ రెడ్డి ప్రకటించారు.

ఇదిలావుంటే, ఉదయం బీజేపీ కార్యకర్త విజేందర్‌తో మాట్లాడిన ఫోన్‌కాల్‌ వైరల్ కావడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి కోవర్ట్ రాజకీయాలు నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి నేత పార్టీలో ఉండకూడదని.. వెంటనే సస్పెండ్‌ చేయాలని తీర్మానించారు. చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. ఆడియో కాల్‌ ఎంత వైరల్ అయిందో.. అంతే స్పీడ్‌గా టీపీసీసీ రెస్పాండ్ అయింది. కౌశిక్‌ రెడ్డి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకోసం 24గంటల గడువిచ్చింది. ఓ వైపు జిల్లా నేతల తీర్మానం.. మరోవైపు షోకాజ్ నోటీసులతో రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కౌశిక్‌ రెడ్డి ప్రకటించారు. ఈనెల 16న గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు.

అయితే, రెడ్డి వర్గానికి ఇవ్వాలా …లేక ఈటల ను ఓడించాలంటే బీసీ వర్గానికి చెందిన వారినే బరిలోకి దింపాలా అనే దాని పైన హుజూరాబాద్ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. దీంతో..కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ నుండి గులాబీ పార్టీ టిక్కెట్ ఖాయమనే ప్రచారం సాగుతున్నా.. నియోజకవర్గంలో మారుతున్న సమీకణాలు..బలా బలాలు ఆధారంగా సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ తరువాతనే నిర్నయం తీసుకొనే అవకాశం ఉంది. కానీ, కౌశిక్ రెడ్డి ముందుగానే టీఆర్ఎస్ లో చేరటం ద్వారా తన సీటుకు మరింత మద్దతు పెంచుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో..ఆయన ఈ నెల 16వ తేదీన గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం. కౌశిక్ రెడ్డి తన భవిష్యత్ అడుగుల గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Read Also…  Koushik Reddy: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కౌశిక్‌రెడ్డి

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..